Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ న్యూ కాంబో.. అసలు మ్యాటర్ ఇదే..

హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శౌర్యువ్

By:  Tupaki Desk   |   8 July 2024 4:38 AM GMT
ఎన్టీఆర్ న్యూ కాంబో.. అసలు మ్యాటర్ ఇదే..
X

హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శౌర్యువ్. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి, కూతురు సెంటిమెంట్ జోడించి కథని చెప్పిన విధానం అందరిని ఆకట్టుకుంది. ఈ యంగ్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం తెరపైకి వచ్చింది. కథ నేరేట్ చేసాడని, అది తారక్ కి బాగా నచ్చి ఒకే చెప్పాడనే న్యూస్ వైరల్ అయ్యింది. తారక్ ప్రస్తుతం దేవర సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

మరో వైపు హిందీలో వార్ 2, ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమాలు చేయాల్సి ఉంది. వార్ 2 మూవీ కూడా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతలో శౌర్యువ్ తో సినిమా అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. క్లాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శౌర్యువ్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయాలగడా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందనే టాక్ కూడా నడుస్తోంది. నిజానికి ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదంట. శౌర్యువ్ ఎన్టీఆర్ కి డైహార్ట్ ఫ్యాన్ అంట. ఎన్టీఆర్ తో సినిమా చేయాలనేది శౌర్యువ్ డ్రీమ్ అని టాక్. తాజాగా ఒక ఫ్యాన్ బాయ్ గా మాత్రమే తారక్ ని కలిసాడని మరో టాక్ వస్తోంది. స్టోరీ నేరేట్ చేసాడనేది కేవలం గాసిప్ మాత్రమే అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. తారక్ తో శౌర్యువ్ మూవీ ఒకే అయ్యిందనే వార్తలలో ఎలాంటి వాస్తవం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది.

అయితే ఇందులో ఏది వాస్తవం అనేది ఎవరూ నిర్ధారించలేరు. శౌర్యువ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ గా కలిసి కథ చెబితే తారక్ వినే అవకాశం ఉంది. అయితే తారక్ మూవీ లైన్ అప్ ప్రకారం చూసుకుంటే మరో మూడేళ్ళ వరకు ఆయన వేరే దర్శకులకి అందుబాటులో ఉండడని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయడం కోసం వెట్రిమారన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు.

అలాగే బాలీవుడ్ లో కొంతమంది దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ తో మూవీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. ఇవన్నీ ఒక ఎత్తైతే రాజమౌళి కూడా ఆర్ఆర్ ఆర్ సీక్వెల్ ఆలోచన ఉంది. ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ కోసం క్యూ కట్టారు. వీరిని పక్కన పెట్టి కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తాడా అంటే ఆలోచించాల్సిందే.