Begin typing your search above and press return to search.

హృతిక్ కి తగ్గకుండా ఎన్టీఆర్ షర్ట్‌ విప్పి...!

ఆర్ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నుంచి సినిమా రావడానికి చాలా సమయం పట్టింది.

By:  Tupaki Desk   |   18 May 2024 4:57 AM GMT
హృతిక్ కి తగ్గకుండా ఎన్టీఆర్ షర్ట్‌ విప్పి...!
X

ఆర్ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నుంచి సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. కొన్ని కారణాల వల్ల తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం అవ్వడానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతున్న దేవర మొదటి పార్ట్‌ షూటింగ్ ఒక వైపు చేస్తూనే మరో వైపు వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటున్నాడు. టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎన్టీఆర్ హిందీ ఎంట్రీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హృతిక్ రోషన్ తో కలిసి వార్‌ 2 లో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ ను కూడా ఎన్టీఆర్‌ పూర్తి చేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా కోసం ఎన్టీఆర్ సిక్స్‌ ప్యాక్‌ కు మారబోతున్నాడు.

గతంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్ తో కనిపించాడు. మరోసారి ఎన్టీఆర్‌ ను సిక్స్‌ ప్యాక్ లో చూడబోతున్నామని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హృతిక్ రోషన్ కండల గురించి, ఆయన బాడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్‌ లోనే మోస్ట్‌ మజిల్‌, అండ్‌ ఫిట్‌ పర్సన్‌ గా హృతిక్ కు పేరు ఉంది.

అలాంటి హృతిక్‌ తో నటిస్తున్నప్పుడే బేలాగా ఉంటే ఎలా.. అందుకే ఎన్టీఆర్‌ కూడా కాస్త కష్టం అయినా, ఇబ్బంది అయినా కూడా సిక్స్ ప్యాక్‌ ను ట్రై చేయబోతున్నాడు. హృతిక్ తో ఉండే ఒక యాక్షన్‌ సన్నివేశంలో ఎన్టీఆర్‌ షర్ట్‌ విప్పి తన సిక్స్ ప్యాక్ ను చూపించబోతున్నాడు అంటూ హిందీ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న వార్‌ 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాల కోసం మరోసారి త్వరలో ఎన్టీఆర్‌ ముంబై వెళ్లే అవకాశాలు ఉన్నాయి.