Begin typing your search above and press return to search.

ఆయ్ కోసం ఎన్టీఆర్.. ఏమన్నారంటే..

అయితే, ఈ ఈవెంట్‌కు అర్జున్‌, ఎన్టీఆర్‌లు అతిథులుగా రావాలనుకున్నా, వారు తమ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న కారణంగా ఈవెంట్‌కు రాలేకపోయారు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 9:02 AM GMT
ఆయ్ కోసం ఎన్టీఆర్.. ఏమన్నారంటే..
X

‘గోదావరి’ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘ఆయ్’ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అంజి కె. మణిపుత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తన యూనిక్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారికా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మరో గ్లామర్‌స్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

ఇక సినిమాకు స్టార్ సెలబ్రిటీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్ తన మిత్రుడు బన్నీ వాస్, సోదరి విద్యా కొప్పినీడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈ ఈవెంట్‌కు అర్జున్‌, ఎన్టీఆర్‌లు అతిథులుగా రావాలనుకున్నా, వారు తమ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న కారణంగా ఈవెంట్‌కు రాలేకపోయారు.

అయినప్పటికీ, అర్జున్ తన శుభాకాంక్షలను పంపించడం విశేషం. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బెస్ట్ విషెస్ అందించారు. నితిన్ ఎన్టీఆర్ బామ్మర్ది అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే ‘ఆయ్’ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రత్యేకంగా ఈ చిత్రం నేపథ్యం, కథాంశం గోదావరి ప్రాంతం చుట్టూ నడవడం వల్ల, ఆ ప్రాంత ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రత్యేకంగా ఆసక్తిని చూపుతున్నారు.

ఇక ఎన్టీఆర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. "నార్నే నితిన్ ఈ సినిమా ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు ఈ సినిమా పట్ల మీ ఉత్సాహాన్ని చూస్తున్నాను.. సినిమాను చూడాలని ఎదురుచూస్తున్నాను. రేపటి విడుదలకు మీకు మరియు ఆయ్ మూవీ మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు.. అని ఎన్టీఆర్ తన సపోర్ట్ అంధించారు. ఇక తారక్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సినిమా గోదావరి ప్రాంతం నేపథ్యం కావడం, కథలోని వినోదాత్మక అంశాలు సినిమాకు మంచి బలం అని చెప్పొచ్చు. గోదావరి ప్రాంతంలోని కట్టుబాట్లతో, ఆ ప్రాంతంలోని జలకాలాటలతో కూడిన ఈ కథ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ‘ఆయ్’ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పోటీగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు కూడా వస్తున్నాయి. కాబట్టి సినిమాకు బలమైన టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు దక్కుతాయి.