అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. కిర్రాక్!
తాజాగా ఇప్పుడు మరోసారి సేమ్ అదే డ్రెస్‌లో దిగిన ఫొటోషూట్‌ను బయటకు వచ్చింది. మళ్లీ అదే రాయల్ లుక్‌లో బ్లాక్ కలర్ ప్యాంట్, జాకెట్ లోపల షర్ట్, చేతికి వాచ్.. అల్ట్రా సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు.
By: Tupaki Desk | 23 Sep 2023 5:26 PM GMTమరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అభిమానులకు దర్శనమిచ్చారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన కొత్త ఫొటోషూట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాలకు ఏడాదికిపైగా గ్యాప్ ఇచ్చిన తారక్.. ప్రస్తుతం దేవర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌పై పూర్తి ఫోకస్ పెడుతూనే మరోవైపు అడపాదడపా యాడ్స్ షూటింగ్లలోనూ పాల్గొంటున్నారు.
రీసెంట్గా ఎన్టీఆర్ దుబాయ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా 2023) వేడుకల్లో ఆయన పాల్గొని సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. అక్కడ కూడా స్టేజ్‌పై మోస్ట్ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఆ ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ సూట్లో రాయల్ లుక్‌లో కనిపించారు. రీసెంట్‌గానే హైదరాబాద్ తిరిగి వచ్చారు.
తాజాగా ఇప్పుడు మరోసారి సేమ్ అదే డ్రెస్‌లో దిగిన ఫొటోషూట్‌ను బయటకు వచ్చింది. మళ్లీ అదే రాయల్ లుక్‌లో బ్లాక్ కలర్ ప్యాంట్, జాకెట్ లోపల షర్ట్, చేతికి వాచ్.. అల్ట్రా సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు. ముఖంలో.. అసలు ఆయన మొత్తం లుక్‌ను చూస్తుంటే నిలువెత్తు రాజసం ఒట్టి పడుతోంది. ఒక ఫొటోలు ఆయన నిల్చొని కనిపించగా.. రెండో పిక్‌లో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చొని కనిపించారు.
ప్రస్తుతం ఈ లుక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను బాగా ఆక్టటుకుంటున్నాయి. ఫ్యాన్స్ వాటికి లైక్స్, కామెంట్స్ పెడుతూ తెగ షేర్ చేస్తున్నారు. వాటిని చూసి మురిసిపోతున్నారు. కాగా ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలకు అండగా నిలిచే ఓ యోధుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు.
సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.