Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌ లో వార్‌ 2... ఇది ఎన్టీఆర్ రేంజ్

హృతిక్‌ రోషన్‌ వార్‌ మూవీ ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వార్ 1 లో హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   3 Oct 2023 8:30 AM GMT
ట్రెండింగ్‌ లో వార్‌ 2... ఇది ఎన్టీఆర్ రేంజ్
X

హృతిక్‌ రోషన్‌ వార్‌ మూవీ ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వార్ 1 లో హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. హృతిక్‌ రోషన్ ఇప్పుడు వార్ 2 సినిమాకి రెడీ అవుతున్నాడు. హృతిక్‌ రోషన్‌ వల్ల ఇప్పటి వరకు వార్ 2 సోషల్‌ మీడియా ట్రెండ్‌ లో నిలువలేదు. కానీ ఎన్టీఆర్ వల్ల వార్ 2 ట్రెండింగ్ లో నిలిచింది.

ఉన్నట్లుండి వార్‌ 2 ట్విట్టర్ లో ట్రెండ్‌ అవ్వడం బాలీవుడ్ వర్గాల వారు కూడా షాక్‌ అయ్యి ఉంటారు. వార్‌ 2 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌ అవ్వడానికి కారణం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్. నేడు వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ హైదరాబాద్‌ వచ్చి దేవర సినిమా సెట్స్ లో ఎన్టీఆర్‌ తో భేటీ అయ్యాడు. ఆ విషయంకు సంబంధించిన విషయాలను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఎన్టీఆర్‌, వార్ 2 హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ లో తెగ ట్రెండ్‌ అయ్యాయి. వేలాది మంది ఈ చర్చలో పాల్గొనడం తో ఒక్కసారిగా జాతీయ స్థాయి లో వార్ 2 సినిమా గురించి చర్చ మొదలు అయింది. హృతిక్‌ రోషన్‌ ఫ్యాన్స్ వల్ల సాధ్యం కాని వార్‌ 2 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వల్ల సాధ్యం అయింది.. ఇది ఎన్టీఆర్ రేంజ్ అంటూ మీడియా సర్కిల్స్ లో కొందరు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌ లో ఉన్న ఎన్టీఆర్‌ ని కలిసి అయాన్ ముఖర్జీ 'వార్‌ 2' ఫైనల్‌ స్క్రిప్ట్‌ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడట. అంతే కాకుండా షూటింగ్ కి సంబంధించిన విషయాలను కూడా ఎన్టీఆర్‌ తో దర్శకుడు మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ భేటీ తో తెలుగు ప్రేక్షకుల్లో వార్ 2 ఎప్పుడు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆసక్తి పెరుగుతోంది.

దేవర సినిమా ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసే విధంగా కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడు. అదే సమయంలో వార్ 2 మూవీ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 2025 లో కచ్చితంగా హిందీ, తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులను ఎన్టీఆర్‌, హృతిక్‌ తమ యాక్షన్ తో ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నారు.