మహేష్...బన్నీ ని బీట్ చేసేలా తారక్ ప్లానింగ్!
అయితే ఇప్పుడా సీరియస్ నెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో కనిపిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'వార్ -2' తో బాలీవుడ్ లో కూడా లాంచ్ అవ్వడంతో ఎండార్స్ మెంట్స్ జోరు పెంచాలని భావిస్తున్నారుట.
By: Tupaki Desk | 12 March 2024 6:04 AM GMTఎండార్స్ మెంట్స్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ దూకుడు ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలే దు. టాలీవుడ్ లో ఏ హీరో చేయనని యాడ్స్ కేవలం మహేష్ మాత్రమే చేస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. బ్రాండింగ్స్ విషయంలో మహేష్ కి కాస్త సమీపంలో బన్నీ కనిపిస్తుం టాడు. ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...యంగ్ టైగర్ ఎన్టీఆర్.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు ఉన్నా మహేష్ అంత యాక్టివ్ గా చేయడం లేదన్నది వాస్తవం.
చరణ్..తారక్ ఇద్దరు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలైనా బ్రాండింగ్స్ విషయంలో మాత్రం వెనుకబ డేవారు. కాదనలేక యాడ్స్ చేయడం తప్ప వారు సీరియస్ గా తీసుకుని చేసింది లేదు. అయితే ఇప్పుడా సీరియస్ నెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో కనిపిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'వార్ -2' తో బాలీవుడ్ లో కూడా లాంచ్ అవ్వడంతో ఎండార్స్ మెంట్స్ జోరు పెంచాలని భావిస్తున్నారుట.
పాన్ ఇండియా క్రేజ్ ని ..బాలీవుడ్ క్రియేట్ అవుతోన్న బజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మహేష్ బ్రాండింగ్స్ చేయాలని సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. కంపెనీలు తన దగ్గరకు రావడం కాదు... తన కోసమే కంపెనీలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడుట. ఫేంలో ఉన్నంత కాలమే వీలైనన్ని ఎక్కువ ప్రకటనలు చేసి నాలుగు రాళ్లు వెనకేయాలని సీరియస్ గానే దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు ముంబై కంపెనీల ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారుట. దానికి సంబంధించిన డీల్ అతి త్వరలోనే పూర్తవుతుందని సమాచారం. అలాగే దేశంలో మరికొన్ని పేరున్న కంపెనీలతోనూ చర్చ లు జరుపుతున్నట్లు తెలిసింది. తారక్ ప్రయత్నాల్ని బట్టి చూస్తుంటే 2024 లో ప్రకటనలతో మరింత బిజీ కాను న్నాడని తెలుస్తోంది. మహేష్..బన్నీని సైతం క్రాస్ చేసేలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇప్పటికే 'ఆర్ ఆర్ ఆర్' సక్సస్ తర్వాత తారక్ పారితోషికం రెట్టింపు అయిన సంగతి తెలిసిందే. 'వార్-2' కోసం భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు. తన హీరో డిమాండ్ ని మించి ఛార్జ్ చేస్తున్నాడు అన్నది ఇన్ సైడ్ టాక్. ఆ లెక్కలో చూస్తే ప్రకటనలో కోసం భారీగానే డిమాండ్ చేసే అవకాశం ఉంది.