Begin typing your search above and press return to search.

తారక్ రెండో యుద్ధం మొదలైంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ చేశారు.

By:  Tupaki Desk   |   23 July 2024 4:07 AM GMT
తారక్ రెండో యుద్ధం మొదలైంది
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ సినిమా రెడీ అవుతోంది. మాగ్జిమమ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

దీని తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ లో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమా రెడీ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని నెలల క్రితం వార్ 2 ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు.

తారక్ కి సంబందించిన కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేశారు. మరల ఆగస్టు 18 నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారంట. ఈ లాంగ్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై ఓ బిగ్ ఫైట్ సీన్ షూట్ సూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తారక్ క్యారెక్టర్ ఎలివేషన్ కి సంబందించిన ఒక సాంగ్ చిత్రీకరణ కూడా ఉండబోతోందంట.

వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. యష్ రాజ్ లాంటి బిగ్ ప్రొడక్షన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉండడం వలన ఆయన ఇమేజ్ గ్రాండ్ గా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో భీమ్ క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కి నార్త్ ఇండియన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన డాన్స్ కూడా బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉన్నారు.

అందుకే వార్ 2 మూవీకి జూనియర్ ఎన్టీఆర్ చాలా పెద్ద ఎస్సెట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ లో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.