Begin typing your search above and press return to search.

తారక్ కోసం లైన్ లోకి బడా విలన్స్

ఇదిలా ఉంటే ఈ వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ మూవీ చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:31 AM GMT
తారక్ కోసం లైన్ లోకి బడా విలన్స్
X

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. ఇది షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. అలాగే హిందీలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ తో పాటు తారక్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ జోనర్ లో మూవీ తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే ఈ వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ మూవీ చేయబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. డ్రాగన్ అనే టైటిల్ తో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. సలార్ 2తో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ చేస్తాడా లేదంటే రెండు వేర్వేరుగా చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

ఇదిలా ఉంటే ప్రస్తుతం డ్రాగన్ ప్రీప్రొడక్షన్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని ఖరారు చేసారంట. విలన్ పాత్ర కోసం వేట కొనసాగుతోంది. డ్రాగన్ మూవీలో విలన్స్ కి సంబందించిన ఇంటరెస్టింగ్ ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ మూవీ తారక్ కోసం ఏకంగా ఇద్దరు పవర్ ఫుల్ విలన్స్ ని ప్రశాంత్ నీల్ దించుతున్నాడంట.

ఆ పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ అయిన బాబీ డియోల్, టైగర్ ష్రాఫ్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. బాబీ డియోల్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది. బాలీవుడ్ యంగ్ హీరోగా దూసుకుపోతున్న టైగర్ ష్రాఫ్ తో ప్రశాంత్ నీల్ చర్చలు జరుపుతున్నారంట. అయితే హీరోగా చేస్తోన్న టైగర్ ష్రాఫ్ తారక్ కి ప్రతినాయకుడిగా నటించడానికి ఎంత వరకు మొగ్గుచూపిస్తాడనేది ప్రశ్నగా ఉంది.

ఒక వేళ ఇద్దరు విలన్స్ ని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేస్తే కచ్చితంగా డ్రాగన్ నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు ఎంత వరకు కరెక్ట్ అనేది చిత్ర యూనిట్ నిర్ధారించే వరకు నమ్మలేం. ఏది ఏమైనా డ్రాగన్ మూవీ మాత్రం ఎన్టీఆర్ కెరియర్ లో హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం అయ్యే ఛాన్స్ లు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఇక త్వరలోనే దేవర సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.