Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ డ్రాగన్.. అసలు నీల్ ప్లానేంటి..?

కేజీఎఫ్ లో రాకీభాయ్ క్యారెక్టర్ అయితే ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 11:30 AM GMT
ఎన్టీఆర్ డ్రాగన్.. అసలు నీల్ ప్లానేంటి..?
X

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరో చాలా పవర్ఫుల్ గా ఉంటాడు, అలాగే కథకు తగ్గట్టుగా నెగిటివ్ షేడ్స్ కూడా యాడ్ చేస్తుంటాడు. అతని మొదటి చిత్రం ఉగ్రంలో హీరో పాత్రకి కాస్తా పాజిటివ్ టచ్ ఉంటుంది. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ లో డాన్ గా ఎదిగే వాడిగానే ఆ పాత్రని డిజైన్ చేశారు. కేజీఎఫ్ లో రాకీభాయ్ క్యారెక్టర్ అయితే ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకవైపు నెగిటివ్ షేడ్స్ హైలెట్ చేస్తూనే మరోవైపు మంచి పర్సన్ గానే చూపించారు. సినిమాలో కూడా ఇతర పాత్రలతో రాకీభాయ్ క్యారెక్టర్ ని విలన్ అంటూ పిలిపించి కొత్తగా రిప్రజెంట్ చేశారు. ప్రశాంత్ నీల్ కథలలో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే వారిలో ఓ మంచి విలన్ గా హీరో పాత్ర ఉంటుంది. ప్రభాస్ తో చేసిన సలార్ మూవీలో దేవా క్యారెక్టర్ ని కూడా రౌడీ తరహాలోనే ప్రశాంత్ రిప్రజెంట్ చేశాడు.

అయితే న్యాయం వైపు నిలబడే రౌడీగా అతని క్యారెక్టర్ ఉంటుంది. ఖాన్సార్ అనే సిటీ బందిపోటు దొంగలు నిర్మించుకున్న నగరంగా చూపించారు. అంటే ప్రశాంత్ నీల్ సినిమాల కథలు మారిన హీరోల క్యారెక్టరైజేషన్స్ మాత్రం ప్రతినాయక ఛాయలతోనే ఉంటాయి. అయితే ఆ పాత్రకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ని సినిమాలో చూపించడం ప్రశాంత్ స్టైల్.

ఈ కారణంగానే అవుట్ ఆఫ్ ది బాక్స్ లో రియాలిటీకి దూరంగా ఓ కొత్త ప్రపంచంలో ప్రశాంత్ నీల్ కథలు నడిచిన ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ పాత్ర ఇప్పటి వరకు ఆయన సినిమాలలో చూసిన వాటికంటే క్రూరంగా ఉంటుందంట. పూర్తిస్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడనే టాక్ తెరపైకి వచ్చింది.

అయితే తారక్ విలన్ గా నటిస్తే డ్రాగన్ లో వేరొకరిని హీరోగా చూపించబోతున్నాడా అనే ప్రశ్న వినిపిస్తోంది. లేదంటే విలన్ ను విలన్ గానే కొట్టాలి అనే ఫార్మాట్ లో స్టోరీ డిజైన్ చేసుకున్నాడా? అనే సందేహం కలుగుతోంది. తారక్ అభిమానులు కూడా ఈ ప్రచారంపై అలాగే రియాక్ట్ అవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలలో అత్యంత క్రూరమైన వాడిగా కనిపించేవాడే హీరోగా ఉంటాడనే విషయాన్ని అర్ధం చేసుకుంటే తారక్ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. డ్రాగన్ లో ఎన్టీఆర్ పాత్రపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే ప్రశాంత్ నీల్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.