Begin typing your search above and press return to search.

దేవర.. ఓ పనైపోయింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర షూటింగ్ చివరి దశలో ఉంది.

By:  Tupaki Desk   |   14 Aug 2024 4:33 AM GMT
దేవర.. ఓ పనైపోయింది!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సెప్టెంబర్ 27న దేవర మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కంప్లీట్ అయ్యింది. టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాతలు మూవీని రిలీజ్ చేయబోతున్నారు.


350+ కోట్ల మేరకు థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ దేవర సినిమాపై జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో పాటు హిందీలో కూడా దేవర సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. దీనికి కారణం ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావడం ఒకటిగా చెప్పొచ్చు. అలాగే బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా మూవీలో చేస్తున్నారు. వీరు కూడా హిందీలో దేవరపై అంచనాలు పెరగడానికి కారణమయ్యారు.

కల్కి 2898ఏడీ ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ ఫీట్ ని అందుకునే అవకాశం దేవరకి కూడా ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేవర నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ “చుట్టమల్లే” ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. 100 మిలియన్ వ్యూస్ ని ఈ సాంగ్ అన్ని భాషలలో కలిపి అందుకుంటుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ దేవరలో తన పోర్షన్ కి సంబందించిన షూటింగ్ కంప్లీట్ చేసేసాడంట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. చిత్ర యూనిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేసింది. లార్డ్ అఫ్ ఫియర్ జూనియర్ ఎన్టీఆర్ తన షూట్ కంప్లీట్ చేశారు అని పోస్ట్ పెట్టారు. దీనికి షూటింగ్ సెట్ లో కొరటాల శివ, తారక్ మాట్లాడుకుంటున్న ఫోటో యాడ్ చేశారు.

మిగిలిన పెండింగ్ షూట్ ఈ నెల ఆఖరుకి కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందంట. మరో వైపు మూవీ టీజర్ రిలీజ్ కి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయుధ పూజ సాంగ్ ని థర్డ్ సింగిల్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తారంట. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నట్లు సాంగ్స్ బట్టి అర్ధమవుతోంది. దేవర సినిమాలో మాస్ ఎలివేషన్ హెవీగా ఉండబోతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా అనిరుద్ ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.