టైగర్ పాప.. టాప్ వ్యూలో ఎంత అంధమో..
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్, జాకెట్ లో అదిరిపోయే అందంతో మెరిసిపోతున్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
By: Tupaki Desk | 2 Aug 2024 5:15 AM GMTబాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ కృతి సనన్. ఈ బ్యూటీ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నేనొక్కడినే సినిమాలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. తరువాత నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రాల తర్వాత బాలీవుడ్ లో కృతి సనన్ సక్సెస్ అయ్యింది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె చెల్లెలు నుపూర్ సనన్ కూడా నటిగా తెరంగేట్రం చేసింది.
సింగర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నుపూర్ సనన్ తరువాత యాక్టర్ గా మ్యూజిక్ వీడియోలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది. ఆ మ్యూజిక్ వీడియో హిట్ కావడంతో తర్వాత దానికి సీక్వెల్ సాంగ్ లో కూడా అక్షయ్ కుమార్ తో జతకట్టింది. తెలుగులో రవితేజకి జోడీగా టైగర్ నాగేశ్వరరావు మూవీలో నుపూర్ సనన్ నటించింది. ఆమెకిదే ఫస్ట్ మూవీ. మొదటి సినిమాతోనే నటిగా నుపూర్ మెప్పించింది. ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తోంది.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కృతి సనన్ తరహాలోనే నుపూర్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఆమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. కేవలం రెండు సినిమాల అనుభవం తోనే నుపూర్ సనన్ ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
టైగర్ నాగేశ్వరరావు తర్వాత టాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలలో గ్లామర్ రోల్స్ అని కాకుండా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే నుపూర్ సనన్ ఎంపిక చేసుకుంటూ నటిగా కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్, జాకెట్ లో అదిరిపోయే అందంతో మెరిసిపోతున్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 10 మిలియన్స్ ఫాలోవర్స్ క్లబ్ లో చేరినందుకు చాలా ఆనందంగా ఉందని ఆ ఫోటోలకి ఇంటరెస్టింగ్ పోస్ట్ జత చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు నుపూర్ సనన్ కి కంగ్రాట్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.