Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ అల్లుడు బ‌నియ‌న్..నిక్క‌రులో!

పెళ్లంటే నూరేళ్ల పంట‌. ఆ పంట ఎంత వైభ‌వంగా జ‌రుగుతుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   4 Jan 2024 6:21 AM GMT
అమీర్ ఖాన్ అల్లుడు బ‌నియ‌న్..నిక్క‌రులో!
X

పెళ్లంటే నూరేళ్ల పంట‌. ఆ పంట ఎంత వైభ‌వంగా జ‌రుగుతుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ సెల‌బ్రిటీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే? పెళ్లి కూతురు..పెళ్లి కొడుకు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతుంటారు. జ‌న్మ‌కో పెళ్లి కాబ‌ట్టి ఆ వేడుక ఎంతో ప్ర‌త్యేకంగా ముస్తాబ‌వుతుంటారు. ఫోటోలు బాగా రావాలి..వీడియో లో బాగా క‌నిపించాలి కాబ‌ట్టి అప్ప‌టిక‌ప్పుడే ఎన్నో ర‌కాల దుస్తులు మారుస్తుంటారు వ‌ధువ‌రూలు.

కానీ ఇలా బ‌నియ‌న్..చొక్కాలో ఏ పెళ్లి కొడుకునైనా ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రైనా చూసారా? అయితే ఇప్పుడు చూడండి. అందుకు నేనే ఉదాహ‌ర‌ణ‌..నా రికార్డు కొట్టే వాడే లేడు అన్న‌ట్లు ముస్తాబ య్యాడు అమీర్ ఖాన్ అల్లుడు. అమీర్ కుమార్తె ఇరాఖాన్- నుపుర్ శేఖ‌ర్ వివాహం బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ వేదికగా నిరాండంబంగా జ‌రిగింది. ఇది రిజిస్ట‌ర్ మ్యారేజ్. వేడుక‌కు హాజ‌ర‌వ్వాల్సిన వారంతా హాజ‌ర‌య్యారు. పెళ్లి కుమార్తె ఎంతో అందంగా ముస్తాబైంది.

పెళ్లి దుస్తుల్లో ఎంతో క‌ళ‌క‌ళ‌లాడింది. కానీ నుపుర్ శిఖ‌ర్ మాత్రం అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసాడు. బ‌నియ‌న్... నిక్క‌రులో వివాహానికి హాజ‌ర‌య్యాడు. అదే త‌న ముస్తాబ‌న్నాడు. ఇక్క‌డ క‌నిపిస్తోన్న ఫోటో చూస్తే అక్క‌డ ఎలాంటి స‌న్నివేశం చోటు చేసుకుంద‌న్న‌ది గెస్ చేయోచ్చు. చొక్కా..నిక్క‌రులో సంత‌కం పెడుతోన్న నుపుర్ ని చూడొచ్చు. నల్ల బ‌నియ‌న్... తెల్లని షార్ట్స్ ధ‌రించి పెళ్లి కొడుకు కొత్త ట్రెండ్ ని ప‌రిచ‌యం చేసాడు.

పెళ్లి కొచ్చిన వారు..అతిధులు అంతా ఎంతో అందంగా డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తే పెళ్లి కొడుకు మాత్రం అలా అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసాడు. నెట్టింట అడ్డంగానూ బుక్క‌య్యాడు. నుపుర్ ని అలా చూసి నెటి జ‌నులు ఓ ఆట ఆడుకున్నారు? అంటే అతిశ‌యోక్తి కాదు. 'అతిథి లాగ్ క్యా సోచ్ రహే హోంగే? గంజి నిక్కర్ మే దుల్హా ఆయా హై, హమ్ ఫల్తు మే తయార్ హ్యూ ' అని ఒక‌రు... పెళ్లి రోజు మీ జీవితంలో అత్యంత అందమైన రోజుగా భావించబడుతుంది.. మీరు చొక్కా మరియు సగం ప్యాంటు ఎందుకు ధరించారు? కనీసం అతిథుల పట్ల గౌరవం చూపించండ‌ని మండిప‌డ్డారు. 'వివాహం కోసం ఈ రకమైన దుస్తులను ఎవరు ధరిస్తారు...???... ఆచారానికి విలువలు ఇవ్వరు'? అంటూ త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.