Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ బికినీ.. టాట్టూ థై సోకులు

గ‌డిచిన రెండేళ్ల‌లో నుస్ర‌త్ నాలుగు సినిమాల్లో న‌టించింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 10:30 PM GMT
రెడ్ హాట్ బికినీ.. టాట్టూ థై సోకులు
X

బాలీవుడ్ న‌టి నుస్ర‌త్ భారూచా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం బోల్డ్ యాక్టింగ్ తో మైమ‌రిపించ‌డం ఈ అమ్మ‌డి స్టైల్. ప్యార్ కా పంచ్‌నామా స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీకి ప‌దుల సంఖ్య‌లో షూ సేక‌ర‌ణ హ్యాబిట్ ఉంద‌ని కూడా వెల్ల‌డించింది. ఛ‌త్రపతి బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

గ‌డిచిన రెండేళ్ల‌లో నుస్ర‌త్ నాలుగు సినిమాల్లో న‌టించింది. అక్ష‌య్ స‌ర‌స‌న సెల్ఫీ చిత్రంలో న‌టించిన నుస్ర‌త్, బ్లాక్ బ‌స్ట‌ర్ 'తూ జూతి మై మ‌ర‌క్క‌ర్'లో కామియోలో క‌నిపించింది. ఛ‌త్ర‌ప‌తి చిత్రంలో స‌ప్నాగా న‌టించింది. అకేళి అనే చిత్రంలోను నుష్ర‌త్ న‌టించింది. చిచోర్ చిత్రంలో న‌టించిన నుష్ర‌త్ ఇప్పుడు సీక్వెల్ చిచోర్ 2లోను న‌టిస్తోంది. మ‌రోవైపు సౌత్ లోను రంగ ప్ర‌వేశం చేసేందుకు ఇక్క‌డ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ చిచోర్ కి సీక్వెల్ చిచోరీ 2లో నుస్ర‌త్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో నుస్ర‌త్ త‌న బోల్డ్ పెర్ఫామెన్స్ తో మ్యాజిక్ చేస్తుంద‌ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు! ఇటీవ‌ల నుస్ర‌త్ కొన్ని వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. తాజాగా రెడ్ హా* బికినీ షూట్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. థై అందాల‌పై అదిరిపోయే టాట్టూల‌తో టీజ్ చేసింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో సంచ‌ల‌నంగా మారుతోంది.