Begin typing your search above and press return to search.

బీచ్ వ్యూలో మైండ్ 'బ్లాక్' చేసే అందాలు..!

తన హాట్ షోతో టాలెంట్ చూపిస్తున్న అమ్మడిని చూసి సరైన అవకాశం వస్తే నువేక్ష దుమ్ముదులిపేయడం ఖాయమనేలా ఉంది. నువేక్ష లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   29 Sep 2023 12:30 AM GMT
బీచ్ వ్యూలో మైండ్ బ్లాక్ చేసే అందాలు..!
X

ప్రతి వీకెండ్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎవరో ఒకరు కొత్తగా పరిచయం అవుతుంటారు. హీరోల కన్నా చాలా ఎక్కువ మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అవుతుంటారు. వీరిలో సక్సెస్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పొచ్చు. అయితే ఉన్నంతలో వచ్చిన ఛాన్స్ ని వాడుకుంటూ కెరీర్ గ్రాఫ్ పెంచుకునే వారు కొందరు ఉంటారు. యువ హీరోయిన్స్ అంతా కూడా తెలుగులో రాణించాలని ఉత్సాహం చూపిస్తారు. కానీ మంచి సినిమా పడితేనే వారు ప్రేక్షకులకు దగ్గరవుతారు.


రెండు మూడు సినిమాలు చేసిన వారు కూడా సరైన గుర్తింపు తెచ్చుకునేందుకు ఫోటో షూట్స్ చేస్తుంటారు. వారి దారిలోనే కొత్త భామ నువేక్ష కూడా తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు లాస్ట్ ఇయర్ కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ సినిమాలో నటించింది. ఆ సినిమాతో పాటుగా అతిథిదేవోభవ సినిమా కూడా చేసింది.

హిట్ ఫస్ట్ కేస్ తో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది అమ్మడు. ప్రస్తుతం అమ్మడు స్నేహం అనే సినిమాలో నటిస్తుంది. చేస్తే సినిమాలు లేదంటే ఫోటో షూట్స్ అనేలా ఉన్నారు ఇప్పటి తరం హీరోయిన్స్. ఈ క్రమంలో నువేక్ష కూడా తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. లేటెస్ట్ గా తన బ్లాక్ డ్రెస్ సోయగాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది అమ్మడు. బీచ్ సైడ్ అందాలు ఓ పక్క బ్లాక్ డ్రెస్ లో నువేక్ష గ్లామర్ షో మరోపక్క పిచ్చెక్కిస్తున్నాయి.

తన హాట్ షోతో టాలెంట్ చూపిస్తున్న అమ్మడిని చూసి సరైన అవకాశం వస్తే నువేక్ష దుమ్ముదులిపేయడం ఖాయమనేలా ఉంది. నువేక్ష లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ లేడీగా ఫాలోవర్స్ కి కిక్ ఇస్తున్న నువేక్ష సినిమాల్లో కూడా ట్రాక్ ఎక్కితే ఇక అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు.

నువేక్ష చేస్తున్న ఫోటో షూట్స్ ద్వారా అయినా అమ్మడికి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి. తన ఇమేజ్ పెంచుకునేందుకు ఎలాంటి పాత్రలైనా ఓకే అంటున్న నువేక్ష కెరీర్ లో ఒక మంచి సినిమా పడితే మాత్రం అమ్మడి ఫేట్ మారే అవకాశం ఉంటుంది.