అనిత ఓ అనిత పెళ్లికి ముందు లవ్ స్టోరీ!
తాజాగా అనిత పెళ్లికి ముందు నడిపించిన లవ్ స్టోరీ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది.
By: Tupaki Desk | 21 Sep 2024 3:30 PM GMTఒకప్పటి హాట్ బ్యూటీ అనిత యూత్ లో ఎంతటి క్రేజీ బ్యూటీ అన్నది చెప్పాల్సిన పనిలేదు. 'నువ్వు నేను' హిట్ తో ఓ రేంజ్ లో పేమస్ అయింది. ఆ తర్వాత అదే ఉదయ్ కిరణ్ తో 'శ్రీరామ్' అనే మరో సినిమా చేసింది. ఇంకా 'తొట్టిగ్యాంగ్'..'నిన్నే ఇష్టపడ్డాను', 'అడంతే అదోటైపు' లాంటి కామెడీ చిత్రాల్లోనూ అనిత మెప్పించింది.
ముఖ్యంగా అమ్మడి యాటిట్యూడ్ కి పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అనిత గురించి సినిమా జనాలకి తప్ప బయట జనాల్లో హైలైట్ కాలేదు. కాల క్రమంలో అవకాశాలు తగ్గడంతో వివాహం చేసుకుని స్థిరపడిపోయింది. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా అనిత పెళ్లికి ముందు నడిపించిన లవ్ స్టోరీ గురించి చెప్పి సర్ ప్రైజ్ చేసింది.
'గతంలో నేను ఈజాజ్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. మా ప్రేమ గురించి అమ్మకు తెలిసి బాధపడింది. మా మతాలు వేరు కావడంతోనే అమ్మ కంగారు పడేది. అయినా అవేం పట్టించుకోలేదు. ఇద్దరం ఎవరికి వారు బాగానే ఉండేవాళ్లం. కానీ కలిసినప్పుడే మా బంధం వర్కౌట్ కాలేదు. అవతలి వారికి నచ్చినట్లుగా మార్చుకుంటే అది ప్రేమ అనిపించుకోదు. తను నన్ను మార్చాలనుకున్నప్పుడు నా కస్సలు అర్దం కాలేదు.
అతడి ప్రేమలో నిండా మునిగి ఉన్నాను. కానీ ఒకరి గురించి నేను మారడం ఏంటి? అని ఆలోచించాను. దీంతో మా బంధం కొనసాగలేదు. విడిపోయిన తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది. ఇంట్లో ఉండలేక బెస్ట్ ప్రెండ్ ఇంటికి వెళ్లిపోయాను. ఆ ఏడాది అంతా తనే నన్ను దగ్గరుండి చూసుకునేది. ఎవరి కోసమే మనం మారాల్సిన పనిలేదు. అలాగే మన పార్టనర్ పోన్ పైనా కన్నేసి ఉండాలి. చేతికి ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నాడు? అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతున్నట్లే భావించాలి' అని తెలిపింది.