అంబానీ చేతుల మీదుగా సామూహిక వివాహాలు!
జులై 2న మహరాష్ట్రలోని పాల్గర్ లో స్వామి వివేకానంద విద్యామందిర్ లో పేద కుటుంబాలకు వివాహాలు జరుపుతున్నారు. ఈ పెళ్లిళ్లకు సంబంధించి మొత్తం ఖర్చును అంబానీ భరిస్తున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2024 7:12 AM GMTఅనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జులై 12న ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రాండ్ ఆ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే అంబానీ ఇంట పెళ్లంటే? ప్రపంచమే మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం కొన్ని సామూహిక వివాహల్ని కూడా జరిపించాలని నిర్ణయించింది.
జులై 2న మహరాష్ట్రలోని పాల్గర్ లో స్వామి వివేకానంద విద్యామందిర్ లో పేద కుటుంబాలకు వివాహాలు జరుపుతున్నారు. ఈ పెళ్లిళ్లకు సంబంధించి మొత్తం ఖర్చును అంబానీ భరిస్తున్నారు. కుమారుడు అనంత్ పెళ్లి సందర్భంగా మరికొన్ని జంటలు కూడా కలపాలని కుటుం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అంబానీ సింప్లిసిటీ గురించి తెలిసిందే. లక్షల కోట్ల అధిపతి అయినా ఎంతో సింపుల్ గా ఉంటారు.
దాతృత్వంలో గొప్ప మనసు చాటిన సందర్భాలెన్నో. ముఖ్యంగా తమ కుటుంబానికి సంబంధించి పెళ్లిళ్ల సమయంలో అన్నధాన కార్యక్రమం ఆ కుటుంబమే దగ్గరుండి నిర్వహిస్తుంటుంది. స్వయంగా అంబానీ కుటుంబ సభ్యులే వడ్డిస్తారు. అనంత్ పెళ్లి సందర్భంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కుమార్తె పెళ్లి సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు.
ఓవైపు తమ స్థాయిని చూపించుకుంటూనే..దాతృత్వాన్ని చాటడం అంబానీ కుటుంబం ప్రత్యేకత. కుటుం బంలో పుట్టిన రోజు వేడుకలు వచ్చిన సమయంలో కూడా విరాళాలు అందిస్తుంటారు. పలు చారిటీలను అంబానీ కుటుంబం స్వయంగా నిర్వహిస్తుంది.