అంచనాలను పెంచేసిన ఓదెల2 టీజర్
ఓదెల2 సినిమాలో తమన్నా తను ఎప్పుడూ కనిపించే పాత్రలకు భిన్నంగా కనిపిస్తుంది.
By: Tupaki Desk | 22 Feb 2025 6:52 AM GMTతమన్నా తెలుగు సినిమా చేసి చాలా రోజులవుతుంది. చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు తమన్నా చేసిన సినిమా ఓదెల2. అయితే ఇప్పటివరకు తమన్నా కెరీర్ లో చేసిన ప్రతీ పాత్ర గ్లామర్ తో కూడుకున్నదే. ఓదెల2 సినిమాలో తమన్నా తను ఎప్పుడూ కనిపించే పాత్రలకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా నటించింది.
రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మహా కుంభ మేళా సందర్భంగా కాశీలో రిలీజ్ చేశారు. 1.52 నిమిషాల నిడివి ఉన్న ఓదెల2 టీజర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. శివునికి తన జీవితాన్ని అంకితం చేసిన మంచి మనిషికి, ఓ ఆత్మకు మధ్య జరిగే కథగా ఓదెల2 తెరకెక్కినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
టీజర్ లో నాగ సాధువు పాత్రలో తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని విజువల్స్ నుంచి చాలా మంచి షాట్స్ ను కట్ చేయగా, వాటిన తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరింత థ్రిల్లింగ్ గా మరల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్. అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది రచనా సహకారం అందించగా, డి. మధు ఓదెల2ను నిర్మిస్తున్నాడు.
అయితే ఈ సినిమా నాలుగేళ్ల కిందట రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కథతో ఇంటెన్స్ యాక్షన్ ను బ్లెండ్ చేస్తూ ఎమోషన్స్, థ్రిల్స్ తో రోలర్ కోస్టర్ గా ఓదెల2 రూపొందిందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. కాకపోతే టీజర్లో కొన్ని సీన్స్, క్యారెక్టర్లను చూస్తుంటే అరుంధతి సినిమా గుర్తొస్తుంది. మొత్తానికి ఓదెల2 టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.