మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ.. అదండి మ్యాటర్..!
ఐతే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమాపై ఆ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థల నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
By: Tupaki Desk | 18 Dec 2024 5:02 PM GMTనందమూరి వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతో మొదలవ్వాల్సి ఉంది. తొలి సినిమా అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు. తెర మీద నందమూరి నట వారసుడు మోక్షజ్ఞని చూడాలని తెగ ఉత్సాహం చూపించారు. ఐతే ఇలా అనౌన్స్ మెంట్ వచ్చిందో లేదో అలా ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వర్మతో చేయాల్సిన మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందని.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టగా దాదాపు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టే అని మొన్నటిదాకా వార్తలు రాసుకొచ్చారు.
దాదాపు మేకర్స్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో అదే నిజమని అనుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అసలైతే మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ చేయాల్సిన సినిమా డిసెంబర్ 5న ముహూర్తం పెట్టాల్సి ఉంది. కానీ అనుకున్న డేట్ కి పూజా కార్యక్రమాలు జరగకపోవడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాదు సినిమా ఆగిపోయిందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఐతే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమాపై ఆ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థల నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ చేస్తున్న సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తేజశ్విని నందమూరి కూడా భాగం అవుతున్నారు. ఐతే ఈ సినిమా ఆగిపోయింది అన్న వార్తలపై మేకర్స్ స్పందించారు. సినిమా పై వస్తున్న వార్తలన్నీ నమ్మొద్దని అఫీషియల్ గా ఎస్.ఎల్.వి సినిమాస్ నుంచి వచ్చే అప్డేట్స్ ని నమ్మండని అన్నారు. అంతేకాదు సినిమా త్వరలోనే మొదలవుతుందని వెల్లడించారు.
హనుమాన్ హిట్ అయ్యాక ప్రశాంత్ వర్మ చాలా బిజీ అయ్యాడు. ఓ పక్క డైరెక్షన్ లో మూడు సినిమాలు కథ అందిస్తూ రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటి మధ్య మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందని చెప్పడంతో నిజమే అని అందరు అనుకున్నారు. కానీ ఆ సినిమా ఆగిపోవట్లేదని సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈ న్యూస్ తో నందమూరి ఫ్యాన్స్ అంతా హమ్మయ్య అనుకున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా అది కూడా పురాణాల టచ్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపిస్తారని టాక్.