ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఎలా ఉంది..?
మలయాళంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు వస్తే మాత్రం అవి తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయి.
By: Tupaki Desk | 20 March 2025 5:21 PM ISTమలయాళంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు వస్తే మాత్రం అవి తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసే వారి స్క్రీన్ ప్లే సినీ ప్రియులను అలరిస్తుంది. ఇప్పటికే మలయాళం నుంచి ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ సినిమాలు రాగా వాటిలో ఈమధ్యనే రిలీజైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా ప్రేక్షకుల మనసులు గెలిచింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజైంది. థియేట్రికల్ లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై అందరు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంతకీ అసలు ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కథ ఏంటంటే.. హరి శంకర్ (కుంచకో బోబన్) ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. అలా డ్యూటీలో జాయిన్ అవుతాడాఓ లేదో బంగారు గొలుసు కేసు వస్తుంది. దాన్ని విచారిస్తుండగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య జరుగుతుంది.. తన పెద్ద కూతురు కూడా సూసైడ్ చేసుకుంటుంది. ఐతే ఆ బంగారు చైన్ మిస్సింగ్ తో పాటుగా ఈ రెండు కేసులకు ఉన్న కనెక్షన్స్ ఏంటి అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలో హరి శంకర్ కు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఐతే అందరు చెబుతున్నట్టుగా అవి ఆత్మహత్యలేనా.. లేదా వారిని ఎవరైనా హత్య చేశారా అన్నది కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.. అలా బంగారు గొలుసుతో మొదలైన అతని ఇన్వెస్టిగేషన్ ఎలా పూర్తైంది అన్నది ఆఫీసర్ ఆన్ డ్యూటీ కథ.
కథగా చెబితే ఇది ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుగా ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని క్రైం థ్రిల్లర్ సినిమాలకు ఒకేరకమైన లైన్ ఉంటుంది. కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాయడంలోనే ఆడియన్స్ మార్కులు వేస్తారు. క్రైం, ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో ఉండే మలుపులు కూడా అది ఆడియన్స్ ఊహలకు అందకుండా చేస్తే ఎక్కువ ఇంప్రెస్ అవుతారు.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలో అది బాగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ కాస్త నరేషన్ స్లోగా అయినట్టు అనిపించినా కూడా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చేస్తాయి. దర్శకుడు జీతూ అష్రాఫ్ ఈ విషయంలో మార్కులు కొట్టేశాడు. మలయాళంలో 12 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్ల పైన వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. తెలుగు థియేట్రికల్ వెర్షన్ పట్టించుకోకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.