Begin typing your search above and press return to search.

'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?

మాలీవుడ్ స్టార్ హీరో కుంచాకో బోబన్, హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మలయాళం మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ.

By:  Tupaki Desk   |   1 March 2025 12:43 PM IST
ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?
X

మాలీవుడ్ స్టార్ హీరో కుంచాకో బోబన్, హీరోయిన్ ప్రియమణి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మలయాళం మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఫిబ్రవరి 20వ తేదీన అక్కడ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఓ రేంజ్ లో అలరిస్తోంది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఆ క్రైమ్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.


జీతు అష్రఫ్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో కుంచాకో బోబన్, ప్రియమణితోపాటు జగదీష్, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చావర నిర్మించగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. మాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ కానుంది.

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ఈఫోర్ సంస్థ రీసెంట్ గా దక్కించుకుంది. ప్రముఖ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా మార్చి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా మేకర్స్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ క్రేజీ రెస్పాన్స్ అందుకుని నెట్టింట వైరల్ గా మారింది.

హరిశంకర్‌ అనే పోలీస్‌ అధికారి.. ఓ కేసు పరిశోధన విషయంలో ఎదుర్కొన్న సవాళ్ళు, ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలే సినిమాగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. వివిధ నేరాలతోపాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలను పోలీస్ హరిశంకర్ ఎలా డీల్‌ చేశారనే విషయాలు ట్రైలర్ లో ఉన్నాయి.

ఆధునిక భారతీయ సమాజంలోని చీకటి కోణాలను సినిమా ప్రతిబింబిస్తుందని క్లియర్ గా తెలుస్తోంది. మంచి యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మూవీ అలరించనున్నట్లు అర్థమవుతోంది. కుంచాకో బోబన్, ప్రియమణి సహా పలువురు నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పాలి. అంతా అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా సినిమా స్టోరీ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజువల్స్ చాలా నీట్ అండ్ రీచ్ గా ఉన్నాయి. ఎడిటర్‌ గా చమన్ చక్కో వర్క్ అదిరిపోయేలా కనిపిస్తోంది. అదే సమయంలో జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. రాబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌ గా బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. మొత్తానికి ట్రైలర్.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.