Begin typing your search above and press return to search.

ఇయర్ ఎండింగ్ కి OG..?

ఓ పక్క హరి హర వీరమలు చేస్తూనే మరోపక్క ఓజీ చేస్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్. వీరమల్లు సినిమా ఫైనల్ గా మార్చి ఎండింగ్ కి రిలీజ్ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 12:30 AM
ఇయర్ ఎండింగ్ కి OG..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న OG సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఫ్యాన్స్ ఆ సినిమాపై ఉన్న తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కి ఒకింత ఇబ్బంది కలిగిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ఐతే ఫ్యాన్స్ మాత్రం ఓజీ సినిమా వచ్చేదాకా తమ జోష్ కొనసాగించేలా ఉన్నారు. సుజిత్ డైరెక్షన్ లో దాదాపు ఏడాదికి పైగానే ఓజీ సెట్స్ మీదకు వెళ్లింది.

ఓ పక్క హరి హర వీరమలు చేస్తూనే మరోపక్క ఓజీ చేస్తూ వచ్చాడు పవన్ కళ్యాణ్. వీరమల్లు సినిమా ఫైనల్ గా మార్చి ఎండింగ్ కి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే ఓజీ పరిస్థితి ఏంటన్నది మాత్రం ఇంకా తెలియట్లేదు. ఐతే ఈమధ్య ఒక ప్రెస్ మీట్ లో తను కమిటైన సినిమాలకు కావాల్సినన్ని డేట్స్ ఇచ్చాను కానీ వాళ్లే దాన్ని సరిగా వాడుకోలేదని అన్నారు. అది వీరమల్లు ఉద్దేశించి అన్నాడా లేదా ఓజీ యూనిట్ ని అన్నాడా అన్నది తెలియదు కానీ పవన్ మాత్రం ఈ సినిమాలు ఇంకా షూటింగ్ చేయడం ఇష్టం లేదన్నట్టుగానే చెప్పాడు.

ఈ క్రమంలో ఓజీ పూర్తి చేయాలంటే పవన్ కళ్యాణ్ కాస్త టైం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం పొలిటికల్ గా ఫుల్ బిజీ అయిన పవన్ అదంతా వదిలేసి సినిమా షూటింగ్ లు పాల్గొనే ఛాన్స్ లేదు. సో చూస్తుంటే ఓజీ మరింత లేట్ పట్టేలా ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓజీని ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే ఇయర్ ఎండింగ్ లో వచ్చేలా చూస్తున్నారట. ఓజీ సినిమాను 2024 సెప్టెంబర్ 27 రిలీజ్ అని డేట్ వేశారు. మరి పరిస్థితి చూస్తే 2025 సెప్టెంబర్ లో కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది.

సుజిత్ డైరెక్షన్ లో కలకత్తా బ్యాక్ డ్రాప్ తో ఓజీ సినిమా వస్తుంది. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై తారాస్థాయి అంచనాలు ఏర్పడేలా చేశారు.