కొత్త ఏడాదిలో మొదటి తేదీకే ఓజీ ట్రీట్!
దీంతో మేకర్స్ పాటల రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనిలో భాగంగా తొలి లిరికల్ సాంగ్ ని కొత్త ఏడాది జనవరి 1న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 20 Nov 2024 3:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 'హరిహర వీరమల్లు' బ్యాలెన్స్ షూటింగ్ పూర్తికాగానే పీకే ఓజీ సెట్స్ కి వెళ్తారు. ఈనేపథ్యంలో యూనిట్ ప్రచారం పనులు మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇంతవరకూ కేవలం పోస్టర్లు, టీజర్ తప్ప ఇంకెలాంటి ప్రచార చిత్రం రాలేదు.
దీంతో మేకర్స్ పాటల రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనిలో భాగంగా తొలి లిరికల్ సాంగ్ ని కొత్త ఏడాది జనవరి 1న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఇంకా నలభై రోజులు సమయం ఉండటంతో ఆ పాట పనులు త్వరలో మొదలు పెట్టనున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పాటను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెం బర్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో ఏపీలో వరదలు కారణంగా రిలీజ్ చేయడం సాద్యం కాలేదు.
ఆ తర్వాత పవన్ సనాతన ధర్మం పరిరక్షణ బాధ్యతలు చెపట్టడం..ఆ ఉద్యమం తీవ్రంగా ఉండటంతో? అప్పుడు సాహసించలేదు. అప్పటి నుంచి ఆ పాట రిలీజ్ పెండింగ్ పడుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో న్యూ ఇయర్ కానుక గానైనా అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఒక్కో లిరికల్ సింగిల్ శ్రోతల ముందుకు తీసుకురానున్నారు. సినిమా రిలీజ్ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
అవన్నీ జరగాలంటే పవన్ ఇకనైనా డిలే చేయకుండా డేట్లు ఇవ్వాలి. ఇందులో పవన్ ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇందులో పవన్ కి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.