Begin typing your search above and press return to search.

OG లీక్‌ పిక్‌ వైరల్‌

వేడుకలు నిర్వహించక పోవడంతో పాటు, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా చివరి నిమిషంలో క్యాన్సల్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 10:21 AM GMT
OG లీక్‌ పిక్‌ వైరల్‌
X

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ గత రెండు మూడు వారాలుగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్‌ 2 వచ్చేసింది. నేడు పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ మొదటి సారి పుట్టిన రోజు జరుపుకుంటున్న కారణంగా గతంలో మించిన వేడుక జరపాలని భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా మొత్తం ప్లాన్‌ రివర్స్ అయ్యింది. వేడుకలు నిర్వహించక పోవడంతో పాటు, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా చివరి నిమిషంలో క్యాన్సల్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అప్డేట్‌ ఇవ్వద్దంటూ పవన్‌ స్వయంగా నిర్మాతలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రెండు సినిమాల అప్‌డేట్స్ ఆగిపోయాయి. ఓజీ కోసం మేకర్స్‌ చాలా ఆసక్తిగా చూశారు. కానీ సినిమా నిర్మాతలు అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు అంటూ ప్రకటించారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం పవన్‌ ఓజీ స్టిల్‌ అంటూ ఒక ఫోటో తెగ షేర్‌ అవుతోంది. ఓజీ మేకర్స్ నుంచి ఇది లీక్ అయ్యిందనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటో కు ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఓజీ లో ఇలా ఉండబోతున్నాడు అన్నట్టు అంతా చర్చించుకుంటున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం మా నుంచి ఎలాంటి పోస్టర్‌ కానీ, స్టిల్‌ కానీ లీక్ అవ్వలేదు అంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ స్టిల్‌ AI- టెక్నాలజీతో రూపొందించినది అయ్యి ఉంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ యాంగ్రీ లుక్‌ తో పాటు, చాలా డిఫరెంట్‌ లుక్ లో కనిపించడం వల్ల ఈ ఫోటోకు మంచి స్పందన వచ్చింది. AI- ఫోటో అయినా కూడా ఓజీ లో పవన్‌ ఇలా ఉండాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఓజీ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఈ స్టిల్‌ ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

సుజీత్‌ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్‌ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. పవన్‌ టైం ఇస్తే మూడు వారాల్లో షూటింగ్‌ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలు, వరదలు వచ్చి ఉండకుంటే ఈ నెలలో ఓజీ సినిమా కోసం పవన్ డేట్లు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఓజీ కోసం ఇప్పట్లో డేట్లు ఇచ్చే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాన్‌ ఇండియా రేంజ్‌ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు రూపొందిస్తున్న ఓజీ లో బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, షామ్‌ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ కు ఓజీ ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మరి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి.