Begin typing your search above and press return to search.

సెప్టెంబ‌ర్ లో ఓజీ.. న‌మ్మొచ్చా?

అయితే వీర‌మ‌ల్లు 9న రిలీజ్ అవుతున్న‌ప్ప‌టికీ ఈ సినిమా కంటే ఓజీ సినిమాపైనే ఎక్కువ బ‌జ్ ఉంది.

By:  Tupaki Desk   |   17 March 2025 4:00 PM IST
సెప్టెంబ‌ర్ లో ఓజీ.. న‌మ్మొచ్చా?
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేస్తున్న రెండు సినిమాలు ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి హరిహ‌ర వీర‌మ‌ల్లు కాగా మ‌రొక‌టి ఓజి. ఈ రెండింటిలో వీర‌మ‌ల్లు మే 9న రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ రీసెంట్ గానే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. క్రిష్ మొద‌లుపెట్టిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు ఏఎం జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు.

అయితే వీర‌మ‌ల్లు 9న రిలీజ్ అవుతున్న‌ప్ప‌టికీ ఈ సినిమా కంటే ఓజీ సినిమాపైనే ఎక్కువ బ‌జ్ ఉంది. ఆ సినిమా కోసమే ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నార‌న్న విష‌యం అందరికీ తెలుసు. ఈ రెండు సినిమాలకు బ‌జ్ విష‌యంలో చాలా తేడా ఉంది. వీర‌మ‌ల్లు ఎప్పుడో క‌రోనాకు ముందు మొద‌ల‌వ‌డం, షూటింగులో జాప్యం వ‌ల్ల ఆ సినిమాపై ఆస‌క్తి త‌గ్గుతూ వ‌చ్చింది. దానికి తగ్గ‌ట్టు డైరెక్ట‌ర్ మార‌డం కూడా సినిమాపై అంచ‌నాల్ని త‌గ్గించింది.

మ‌రోవైపు సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఓజీ సినిమా మాత్రం టీజ‌ర్ తోనే నెక్ట్స్ లెవెల్ హైప్ ను క్రియేట్ చేయ‌గ‌లిగింది. టీజ‌ర్ చూశాక ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఓజీ చూస్తామా అని తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ ప‌వ‌న్ రాజ‌కీయాలతో బిజీగా ఉండ‌టం వ‌ల్ల షూటింగ్ ల‌కు హాజ‌రు కాలేక‌పోవ‌డంతో వీర‌మ‌ల్లు, ఓజీ లేట‌వుతూ వ‌చ్చాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ వీర‌మ‌ల్లు మూవీకి ఏప్రిల్ లో, ఓజీకి మే, జూన్ నెల‌ల్లో డేట్స్ ఇస్తాడ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఓజీ సెప్టెంబ‌ర్ లో రిలీజ‌య్యే ఛాన్స్ ఉంద‌ని డిస్ట్రిబ్యూష‌న్ వ‌ర్గాల్లో ప్ర‌చారం కూడా మొద‌లైంది. ఈ విష‌యం ప‌వ‌న్ ఫ్యాన్స్ కు జోష్ ను ఇస్తున్న‌ప్ప‌టికీ ఇందులో ఎంత నిజ‌ముందో ఇప్పుడే చెప్ప‌లేం. వీర‌మ‌ల్లు వ‌చ్చిన నాలుగు నెల‌లకే ప‌వ‌న్ నుంచి మ‌రో పాన్ ఇండియా సినిమా రిలీజ‌వ‌డం డౌటే.

షూటింగ్ అయిపోయినా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, డ‌బ్బింగ్, ప్ర‌మోష‌న్స్ అంటూ చాలా విష‌యాలుంటాయి. దానికి తోడు సెప్టెంబ‌ర్ లో ఇప్ప‌టికే అఖండ‌2, సంబ‌రాల ఏటిగ‌ట్టు షెడ్యూలై ఉన్నాయి. ఒక‌వేళ పవ‌న్ వ‌స్తున్నాడంటే సాయి దుర్గ తేజ్ సంబ‌రాల ఏటి గ‌ట్టు వాయిదా ప‌డుతుంది కానీ బాల‌య్య త‌న సినిమాను వాయిదా వేసుకోడు. వీటితో పాటూ ర‌జినీకాంత్ కూలీ కూడా సెప్టెంబ‌ర్ మీదే క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అలాంటప్పుడు ఓజీకి సోలో రిలీజ్ ద‌క్క‌దు. కాబ‌ట్టి వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక‌వేళ ఓజీని నిజంగా సెప్టెంబ‌ర్ లో తీసుకునిరావాల‌నుకుంటే ఇప్పుడో డేట్ ను అనౌన్స్ చేస్తే మిగిలిన సినిమాల‌తో ఇబ్బంది ప‌డే ప‌నుండ‌దు. దాంతో పాటూ చిత్ర ప్ర‌మోష‌న్స్ ను కూడా రిలీజ్ డేట్ ను బ‌ట్టి ప్లాన్ చేసుకునే ఛాన్సుంది.