ఓజీ.. అంచనాలు ఆకాశంలో..
ఈ మూవీ షూటింగ్ తాజాగా థాయ్ లాండ్ లో మొదలైనట్లు తెలుస్తోంది. ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారనే మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 19 Dec 2024 12:49 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా 'బ్రో' మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తరువాత మూడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా ఈ సినిమాలేవీ కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఈ ఏడాది ఎన్నికల హడావిడి తరువాత డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో భాగం కావడంతో మెజారిటీ సమయం రాజకీయాలకి వెచ్చిస్తున్నారు.
అయితే పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని నిర్మాతలకి మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వెసులుబాటు కోసం ఈ సినిమా సెట్ ని అమరావతిలోనే వేశారు. ఇదిలా ఉంటే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నారు. ఫ్యాన్స్ కి కూడా 'హరిహర వీరమల్లు' సినిమా కంటే ఈ చిత్రం పైన ఎక్కువ హోప్స్ ఉన్నాయి.
గతంలో ఓ పొలిటికల్ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ 'ఓజీ' బాగుంటుందనే కామెంట్స్ చేశారు. ఏ సినిమా అయిన ప్రమోషన్స్ చేసుకోవాలంటే కచ్చితంగా ఆ మూవీలో నటించిన స్టార్స్ ఉండాలి. అయితే పవన్ కళ్యాణ్ మాటే తన సినిమాలకి పెద్ద ప్రమోషన్ అని చెప్పాలి. 'ఓజీ' గురించి పవన్ కామెంట్స్ చేసిన తర్వాత సినిమాపైనే అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.
ఇప్పటి వరకు సినిమా నుంచి ఒక చిన్న టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యింది. అయిన కూడా ఈ మూవీపైన అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు 'ఓజీ' ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం నేహాశెట్టిని ఎంపిక చేశారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో మరోసారి ఈ మూవీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బట్టి సినిమాపై ఈ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ షూటింగ్ తాజాగా థాయ్ లాండ్ లో మొదలైనట్లు తెలుస్తోంది. ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారనే మాట వినిపిస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. తప్పకుండా సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీక్ కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దానయ్య కూడా ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మరి సినిమా రిలీజ్ టైమ్ లో ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.