OG టీమ్‌తో చాలా హ్యాపీ.. జపనీ థాయ్ ట్యాలెంట్
ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పాపులర్ జపనీస్ నటుడు కజుకి కితామురా .. ప్రముఖ థాయ్ నటుడు వితయ పన్‌స్రింగార్మ్ నటిస్తున్నారని తెలిపాడు.
By: Tupaki Desk | 18 Dec 2024 5:04 PM GMTపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG కోసం కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపే అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ తారలు నటిస్తున్నారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
OG సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తించే విషయం చెప్పారు. ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పాపులర్ జపనీస్ నటుడు కజుకి కితామురా .. ప్రముఖ థాయ్ నటుడు వితయ పన్‌స్రింగార్మ్ నటిస్తున్నారని తెలిపాడు. క్వెంటిన్ టరాన్టినో 'కిల్ బిల్' సిరీస్ .. టెలివిజన్ షో టోక్యో స్విండ్లర్స్ ఆన్‌లైన్ టీవీ స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో కజుకి కితామురా సహాయక పాత్రలు పోషించారు. థాయ్ నటుడు వితయ పాన్‌స్రింగార్మ్ 'ఓన్లీ గాడ్ ఫర్గివ్స్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఓజీ టీమ్ తో చేరారు.
సుజీత్ లాంటి యంగ్ డైనమిక్‌తో పని చేసే అవకాశం కలిగినందుకు వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా టీమ్ తో టామ్ అనే డివోపీ కూడా పని చేసారు. అతడు దర్శకుడు సుజీత్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి డివోపి రవి.కె.చంద్రన్ ని ట్యాగ్ చేసి, తనకు ఇలాంటి టీమ్ తో పని చేయడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అరంగేట్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ ఇమ్రాన్ కి ప్రత్యేకమైనది. ప్రియాంక మోహన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.