Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ లో OG వైబ్

ఈవెంట్ లో మెగా హీరోలు మాట్లాడే సమయంలో పవర్ స్టార్ స్లొగన్స్ చేస్తూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 7:57 AM GMT
గేమ్ చేంజర్ లో OG వైబ్
X

మెగా హీరోల సినిమా ఫంక్షన్స్ ఎక్కడ జరిగిన అక్కడ పవర్ స్టార్ అభిమానుల సందడి కచ్చితంగా ఉంటుంది. ఈవెంట్ లో మెగా హీరోలు మాట్లాడే సమయంలో పవర్ స్టార్ స్లొగన్స్ చేస్తూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటారు. మెగా హీరోలు కూడా ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఆపే ప్రయత్నం చేయరు. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు మాట్లాడి వారిని సంతృప్తిపరుస్తారు.

మెగా ఫ్యాన్స్ లలో ఆల్ మోస్ట్ చాలా మంది పవర్ స్టార్ అభిమానులే ఉంటారు. అందుకే మెగా హీరోల ఈవెంట్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. యూఎస్ లో డల్లాస్ వేదికగా జరిగిన 'గేమ్ చేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా పవర్ స్టార్ అభిమానుల సందడి కనిపించింది. ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు పవర్ స్టార్, OG అంటూ ఫ్యాన్స్ స్లొగన్స్ చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన పవర్ స్టార్ మానియా మాత్రం తగ్గదని ఈ ఈవెంట్ ద్వారా ప్రూవ్ అయ్యిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఈ ఫ్యాన్స్ సందడిని చూసిన రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా 'ఓజీ' సినిమా గురించి చరణ్ ప్రస్తావించారు. ఆ సినిమా కోసం నేను కూడా వెయిటింగ్. నిజంగా ఈ సినిమా గాని లేకుండా ఉంటే కచ్చితంగా బాబాయ్ ని ఫోర్స్ చేసి అయిన 'ఓజీ'ని సంక్రాతికి రిలీజ్ చేయించేవాడినని చరణ్ అన్నారు. ఆ మాటతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అలాగే ఈ సంక్రాంతి డేట్ మాది కాదని, డాడీ చిరంజీవి మా కోసం ఈ డేట్ ఇచ్చేశారని, ఆయనకి ఈ సందర్భంగా థాంక్స్ తెలియజేస్తున్నానని చరణ్ గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇండియా బయట ప్రీరిలీజ్ ఈవెంట్ చేసుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా 'గేమ్ చేంజర్' రికార్డ్ సృష్టించింది. ఈ ఈవెంట్ తో మూవీ ప్రమోషన్స్ కూడా మేకర్స్ షురూ చేశారు. జనవరి 10న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ ని అంత వరకు ప్రతి వారం ఒక రాష్ట్రంలో నిర్వహించాలని దిల్ రాజు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాపైన ప్రత్యేక ఫోకస్ చేశారు.

హిందీలో ఈ మూవీ మంచి వసూళ్లు సాధిస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంటుందని దిల్ రాజు నమ్ముతున్నారు. 'పుష్ప 2' కూడా అదే ప్రూవ్ చేసింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లో 50 శాతం నార్త్ ఇండియా నుంచి రావడం విశేషం. అలాగే ఈ ఏడాది రిలీజ్ అయిన 'దేవర', 'కల్కి 2898ఏడీ', 'హనుమాన్' సినిమాలు నార్త్ లో మంచి వసూళ్లు సాధించాయి.

వచ్చే ఏడాది ఆరంభంలో టాలీవుడ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా 'గేమ్ చేంజర్' ఉంది. ఈ మూవీ హిట్ అయితే రామ్ చరణ్ మార్కెట్ కూడా పెరుగుతుంది. శంకర్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నారు. మరి ఈ చిత్రం వారికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.