Begin typing your search above and press return to search.

OG కి పోటీ వచ్చేస్తారా..?

ఐతే ఆల్రెడీ విజయ్ దేవరకొండ సినిమా ఉంది కాబట్టి ఓజీ రిలీజ్ కాకపోవచ్చు. ఒకవేళ ఓజీ వస్తే పోటీ ఎందుకని విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ వాయిదా వేసే ఛాన్స్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 7:14 AM GMT
OG కి పోటీ వచ్చేస్తారా..?
X

స్టార్ సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ చేస్తున్న హడావిడి వల్ల ఫ్యాన్స్ అప్ సెట్ అవుతున్నారు. సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ వేయడం ఆ డేట్ వచ్చాక సారీ మూవీ పోస్ట్ పోన్ అనేయడం చాలా కామన్ అయ్యింది. పెద్ద బడ్జెట్ తో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న సినిమాల విషయంలో ఇది జరగడం చాలా కామన్ అయ్యింది. ఐతే వాటి విషయంలో తొందర పడితే రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందని అలా చేస్తున్నారు. ఐతే రాబోతున్న సినిమాల విషయంలో రిలీజ్ కన్ ఫ్యూజన్ ఇప్పటికే మొదలు కాగా డిసెంబర్, జనవరి అదే సంక్రాంతికి సీజన్ వదిలి ఇప్పుడు మార్చిలో కూడా సినిమాల మధ్య ఫైట్ జరగబోతుందని తెలుస్తుంది.

డిసెంబర్ నెలలో పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు వస్తుండగా సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, వెంకటేష్ 76వ సినిమా రిలీజ్ లాక్ చేసుకున్నాయి. వీటితో పాటు నాగార్జున సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఐతే సంక్రాంతి మిస్సైతే ఇదివరకు సమ్మర్ అని చెప్పే మేకర్స్ ఇప్పుడు మార్చిలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మార్చి చివర్లో రిలీజ్ అవుతున్న సినిమాలకు మంచి ప్రాఫిట్స్ వస్తున్న కారణంగా మార్చి ఎండింగ్ లో మూవీస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఇయర్ మార్చి ఎండింగ్ లో టిల్లు స్క్వేర్ వచ్చి 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక నెక్స్ట్ ఇయర్ మార్చి 28కి విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్న వీడీ 12వ సినిమాను మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐతే వీడీ 12వ సినిమా మార్చి 28 రిలీజ్ అనౌన్స్ చేయగా అదే డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వస్తుందని టాక్.

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా భారీ హైప్ తో వస్తుంది. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా మార్చి 28 రిలీజ్ అనుకుంటున్నారట. ఐతే ఆల్రెడీ విజయ్ దేవరకొండ సినిమా ఉంది కాబట్టి ఓజీ రిలీజ్ కాకపోవచ్చు. ఒకవేళ ఓజీ వస్తే పోటీ ఎందుకని విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ వాయిదా వేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకానీ ఓజీతో ఏ సినిమా పోటీకి వచ్చే ఛాన్స్ ఉండదని లేటెస్ట్ టాక్.