Begin typing your search above and press return to search.

బాబాయ్ రాకతో ఇరకాటంలో అబ్బాయ్..!

అయితే సెప్టెంబర్ లో OG రిలీజ్ అనేసరికి రాం చరణ్ గేమ్ చేంజర్ టీం కి షాక్ తగిలింది. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కుదరట్లేదు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 2:41 PM GMT
బాబాయ్ రాకతో ఇరకాటంలో అబ్బాయ్..!
X

వరుసెంట సినిమాలు చేయడమే కాదు వాటి రిలీజ్ గురించి కూడా ముందునుంచి ప్లానింగ్ తో ఉండాలని స్టార్ సినిమాల రిలీజ్ ఫైట్ చూస్తే అర్ధమవుతుంది. ఫెస్టివల్ అంటే చాలు మా సినిమా రిలీజ్ అంటే మా సినిమా రిలీజ్ అని పోటీ పడుతుంటారు. ఇక ఎప్పుడో వచ్చే సంక్రాంతికి, దసరాకి ఇప్పటి నుంచే రిలీజ్ లాక్ చేసి ఖర్చీఫ్ వేసుకున్నారు. సినిమా అప్పటికల్లా అవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి.. ముందు అనౌన్స్ చేస్తే మేము ముందు చెప్పాం కాబట్టి మేము వెనక్కి తగ్గమని చెప్పడానికి ఉంటుందని అలా చేస్తుంటారు.

స్టార్ సినిమాల రిలీజ్ ఫైట్ నిర్మాతల మండలికి సరికొత్త తలనొప్పి తెస్తుంది. సంక్రాంతి ముగిసింది.. సమ్మర్ రానుంది.. అయితే స్టార్ సినిమాలేవి సమ్మర్ రేసులో రావడం కష్టమని తెలుస్తుండగా ఆ సీజన్ యువ హీరోలు ఆక్యుపై చేస్తున్నారు. ఇక ఆగష్టు 15న సినిమాలు కొన్ని రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సెప్టెంబర్ చివరి వారంలో పవన్ కళ్యాణ్ OG రిలీజ్ అంటూ నిర్మాతలు ప్రకటించారు. సెప్టెంబర్ 27న OG రిలీజ్ లాక్ చేశారు. పవన్ ఒక నెల రోజులు డేట్స్ ఇస్తే సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ లో OG రిలీజ్ అనేసరికి రాం చరణ్ గేమ్ చేంజర్ టీం కి షాక్ తగిలింది. దిల్ రాజు బ్యానర్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కుదరట్లేదు.

శంకర్ మీద నమ్మకం లేకనే సమ్మర్ రిలీజ్ చేయాలని అనుకున్న సినిమా కాస్త సెప్టెంబర్ అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అబ్బాయ్ సినిమాకు బాబాయ్ పోటీకి దిగుతున్నాడు. సెప్టెంబర్ చివరి వారం రిలీజ్ చేస్తే అక్టోబర్ 2 గాంధి జయంతి కలిసి వస్తుందని అనుకున్న దిల్ రాజు ప్లాన్ కి OG టీం షాక్ ఇచ్చింది.

బాబాయ్ పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజ్ రాకతో అబ్బాయ్ గేమ్ చేంజర్ సినిమా ఇరకాటంలో పడిందని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ సెప్టెంబర్ వదిలి ఆగష్టులో రాలేని పరిస్థితి.. ఇక కుదిరితే అక్టోబర్ కి వెళ్లడమే మిగిలి ఉంది. శంకర్ గేమ్ చేంజర్ తో పాటుగా మరోపక్క కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 కూడా ఆగష్టు లేదా సెప్టెంబర్ లోనే రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందట. మరి ముందు ఇండియన్ 2 వచ్చి ఆ తర్వాత గేమ్ చేంజర్ వస్తుందా.. లేదా చరణ్ సినిమానే ముందు రిలీజ్ చేసి ఇండియన్ 2 ని వెనక్కి నెడతారా అన్నది తెలియాల్సి ఉంది.