OG గ్లింప్స్.. చిరుతలా వేటాడుతూ పవన్ ఊచకోత
ముందుగా చెప్పినట్టుగానే ఇందులో పవన్ లుక్స్, వైలైన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అస్సలు ఊహించని రేంజ్లో ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
By: Tupaki Desk | 2 Sep 2023 5:43 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చేశారు ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మేకర్స్. అభిమానులకు పూనకాలు వచ్చే రేంజ్లో 'హంగ్రీ చీతా' గ్లింప్స్‌ను రిలీజ్ చేసి సోషల్‌మీడియాను షేక్ చేసేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఇందులో పవన్ లుక్స్, వైలైన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అస్సలు ఊహించని రేంజ్లో ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
'ఆకలితో ఉన్న పులి వస్తున్నట్లు' మేకర్స్ చెప్పినట్టుగా పులి.. జింకలను వేటాడినట్టుగా పవన్ శత్రువలను ఊచకోత కోస్తూ కనిపించారు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఆయన లుక్స్, చీతా లాంటి కళ్లు, ఒక్కోకరిని నరుక్కుంటూ పోతుంటే గ్లింప్స్ మొత్తం షేకే అయిపోయినట్టు అనిపించింది. మొత్తంగా ఇప్పుటి వరకు చూడని పవన్ విశ్వరూపాన్ని ఇందులో చూపించారు.
"పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరును ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం.. ఇప్పటికీ ఏ తుపాను కడగలేకపోయింది. ఇట్ వజ్ ఏ ఫ్రీకింగ్ బ్లడ్ పాత్.. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. సాలా సైతాన్" అంటూ పవన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయాయి. చివర్లో ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అంటూ ప్రచార చిత్రాన్ని ముగించారు. తమన్ అందించిన సంగీతం నిజంగానే బ్సాస్ట్ అయ్యే రేంజ్లో ఉన్నాయి.
మొత్తంగా ఈ గ్లింప్స్.. యూట్యూబ్ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. ఇక దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోవడం పక్కా అనిపిస్తోంది. అభిమానులకు ఇక పూనకాలు వచ్చేస్తాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. 1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్రీకరణ జరుపుకుంది.
సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.