Begin typing your search above and press return to search.

ఓజీ.. లెక్క గట్టిగానే పెరిగింది?

ఒజీ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడయ్యాయంట. ఏకంగా 90 కోట్లకి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందంట.

By:  Tupaki Desk   |   8 Jun 2024 4:02 AM GMT
ఓజీ.. లెక్క గట్టిగానే పెరిగింది?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ ఓజీ. ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలో మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రమాణస్వీకారం హడావిడి అంతా ముగిశాక జులై, ఆగష్టు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. సుజిత్ కూడా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒజాస్ గభీర అనే గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి సంబందించిన గ్లింప్స్ రిలీజ్ అయ్యి అందరికి కనెక్ట్ అయ్యింది. అలాగే పోస్టర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఫ్యాన్స్ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఒజీ నిలుస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒజీ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడయ్యాయంట. ఏకంగా 90 కోట్లకి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుందంట. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. ట్రేడ్ వర్గాలలో మాత్రం ఈ న్యూస్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. ఓజీ మూవీ డిజిటల్ రైట్స్ కి 90 కోట్లు అంటే పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ కలెక్షన్స్ వచ్చేసినట్లే. మూవీని 150 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

జనసేన పార్టీ 2024 ఎన్నికలలో గెలిచిన తర్వాత దేశ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి విస్తృత చర్చ నడుస్తోంది. విపరీతమైన క్రేజ్ పవన్ కళ్యాణ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ని భారీ ధరకి కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో సుజిత్ టీమ్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఓ 25 రోజుల కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉందంట.

రెండు షెడ్యూల్స్ లో కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ కి సంబందించిన సీక్వెన్స్ కంప్లీట్ చేస్తే మూవీ మొత్తం పూర్తయిపోతుందంట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా ఇండియా రేంజ్ లో ఈ సినిమా 5 భాషలలో రిలీజ్ కానుంది.