ఈ రీజన్స్ కారణంగానే OG కంటే ముందు వీరమల్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న రెండు పాన్ ఇండియా సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ.
By: Tupaki Desk | 31 May 2024 5:35 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న రెండు పాన్ ఇండియా సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ. ఈ రెండు కూడా 150+ కోట్లకి పైగా బడ్జెట్స్ తోనే తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు డిఫరెంట్ జోనర్ కథలతో సిద్ధమవుతున్నాయి. హరిహర వీరమల్లు కంప్లీట్ గా పీరియాడికల్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథగా ఉండబోతోంది. ఓజీ మూవీ కాన్సెప్ట్ కంప్లీట్ పీరియాడికల్ ఫిక్షనల్ కథాంశంతో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతోంది.
ఈ కారణంగానే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలపై ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ఓజీ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. హరిహర వీరమల్లు చిత్రాన్ని డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం సిచువేషన్ చూసుకుంటే ఓజీ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.
దీనికి కారణం ఓజీ సినిమాకి సంబందించిన షూటింగ్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాకపోవడం ఒకటి. అలాగే బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ కాలేదంట. నాన్ థీయాట్రికల్ రైట్స్ కి సంబందించిన డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. ఒక వేళ షూటింగ్ వేగంగా కంప్లీట్ చేసిన బిజినెస్ లెక్కలు అన్ని తేలేవరకు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. సెప్టెంబర్ లో అనుకుంటున్నప్పటికి బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతాయనే గ్యారెంటీ లేదంట. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం ఇంకా ఎవరూ ముందుకి రాలేదంట.
హరిహర వీరమల్లు మూవీకి ఈ పరిస్థితి లేదంట. ఇప్పటికే ఆల్ మోస్ట్ బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ కంప్లీట్ అయ్యిందంట. అలాగే ఇప్పటి వరకు కంప్లీట్ అయిన షూటింగ్ పార్ట్ కి సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ స్పీడ్ గా నడుస్తుందంట. మిగిలిన పార్ట్ చిత్రీకరణ జరిగిన తర్వాత వీలైనంత ఎర్లీగా రిలీజ్ చేయడానికి ఛాయస్ ఉందంట. అందుకే డిసెంబర్ లో హరిహర వీరమల్లు విడుదలకి అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
రెండు భిన్నమైన కథలతో పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమాలు కావడంతో అభిమానులు ఏది ముందు రిలీజ్ అయిన కూడా ఆదరిస్తారు. అయితే కంటెంట్, డైరెక్టర్, స్టోరీ ప్రెజెంటేషన్ బట్టి ఫ్యాన్స్ కి కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆ అంచనాలు ఎలా ఉన్నా. ప్రేక్షకాదరణ విషయంలో మాత్రం రెండింటికి ఒకే రేంజ్ లో రెస్పాన్స్ దక్కుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.