Begin typing your search above and press return to search.

OG.. అసలు కథ ఇదేనా?

అయితే ఇప్పుడు సినిమా అసలు కథ ఇదే అని మరో టాక్ కూడా వైరల్ అవుతుంది. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ఐఎండిబి వెబ్ సైట్ లో ఈ విధంగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 5:01 PM GMT
OG.. అసలు కథ ఇదేనా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. OG సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మార్కెట్లో కూడా డిమాండ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు కాకుండా ఇలాంటి స్ట్రైట్ సినిమాలు చేస్తే క్రేజ్ ఎలా పెరుగుతుందో ఈ సినిమా రుజువు చేసే విధంగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు కేవలం టీజర్ మాత్రమే విడుదలయ్యింది. దానితోనే సినిమా మార్కెట్లో ఊహించని స్థాయిలో డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ సినిమాను RRR నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ఇక సుజిత్ OG సినిమాలను పూర్తిగా ముంబై నేపథ్యంలో చూపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన పలు కరకాల లీక్స్ కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు సినిమా అసలు కథ ఇదే అని మరో టాక్ కూడా వైరల్ అవుతుంది. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ఐఎండిబి వెబ్ సైట్ లో ఈ విధంగా పేర్కొన్నారు. ఓజాస్ గంభీర అనే ఒక టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడే చిక్కుకుపోతాడు. అయితే అతను ఆ తరువాత గ్యాంగ్ స్టార్ గా మారాల్సి వస్తుంది. అనంతరం క్రైమ్ మాఫియాలతో కూడా అతనికి సంబంధాలు ఏర్పడి అక్కడే ఒక కింగ్ గా ఎదుగుతాడు.

ఇక తన కుటుంబ సభ్యులను సన్నిహితులను ఆ గొడవల్లోనే కోల్పోతాడు. అనంతరం ప్రతీకారం కోసం అతను విలన్స్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా మారింది. అసలు OG ఏ విధంగా గ్యాంగ్ స్టర్ గా మారుతాడు అనేది సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్టోరీ లైన్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ స్టైల్ కు తగ్గట్టుగానే కంటెంట్ ను హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ స్టోరీ కూడా మరింత హాట్ టాపిక్ మారుతోంది. తప్పకుండా సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉంటుంది అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.