Begin typing your search above and press return to search.

కల్కి కిక్కులో OG వైబ్

ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ షోలలో అక్కడి ఇండియన్ ఫ్యాన్స్ కల్కి చూసేసారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:40 AM GMT
కల్కి కిక్కులో OG వైబ్
X

ఎంతో కాలంగా ఊరిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ ఫైనల్ గా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం పబ్లిక్ మొత్తం ఈ మూవీ ట్రాన్స్ లో ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ సంభవం చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ షోలలో అక్కడి ఇండియన్ ఫ్యాన్స్ కల్కి చూసేసారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్, ఏఏ సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేశారు.

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కల్కి మూవీ 4 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా 10 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని టచ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కల్కి కిక్కులో ఉన్న ప్రేక్షకులకి OG మరింత కిక్కు దక్కుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ రైట్స్ ని ప్రత్యంగిర సినిమా డిస్టిబ్యూటర్ సొంతం చేసుకున్నారు. ఫ్యాన్సీ ధరకి ఓజీ రైట్స్ ని ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. పవన్ కళ్యాణ్ ఓ రెండు షెడ్యూల్స్ లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో పరిపాలన కార్యకలాపాలలో బిజీబిజీగా ఉన్నారు.

ఇక కల్కి సినిమా రిలీజ్ అవుతూ ఉండగా సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు OG టీజర్ ను ప్రదర్శిస్తున్నారు. దీంతో యూఎస్ ఫ్యాన్స్ కు మరింత కిక్కు లభిస్తోంది. పవన్ పవర్ లోకి వచ్చిన తరువాత మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు ప్రభాస్ + పవన్ ఫ్యాన్స్ ఆ వైబ్ ను మరింత ఎంజాయ్ చేసేలా కల్కి OG సినిమాలు పవర్ఫుల్ వైబ్ ఇస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అని సుజిత్ వెయిట్ చేస్తున్నారు. జులైలో ఓజీ షూటింగ్ పై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తే సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీంతో పాటు హరిహర వీరమల్లు మూవీ కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటానని నిర్మాత ఏఎం రత్నం గతంలో తెలిపారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రాబోతున్నాయి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ క్రేజ్ సినిమాకి కూడా ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.