ఓ మై బేబీ.. వాళ్ళకే నచ్చట్లేదంటే..
ఒరిజినల్ క్రిటిక్స్ సినిమా బాలేదని చెప్పుకొచ్చినా కూడా సినిమా తమకు నచ్చితే మాత్రం ఆ మూవీని బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించేలా చేస్తారు.
By: Tupaki Desk | 14 Dec 2023 5:08 AM GMTసాధారణంగా అన్ని సినిమాలకు మూవీ క్రిటిక్స్ తమ అభిప్రాయాలను చెబుతుంటారు. సోషల్ మీడియా వేదికగా సినిమా ఎలా ఉందో షేర్ చేసుకుంటుంటారు. కానీ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు క్రిటిక్స్ ఎవరంటే ఘట్టమనేని అభిమానులేనని చెప్పొచ్చు. ఎందుకంటే మహేశ్ సినిమా యావరేజ్ గా ఉన్నా చాలు.. దాన్ని ఫ్యాన్స్ సూపర్ హిట్ చేసేస్తారు.
సినిమా కాస్త తేడా కొడితే ఓపెనింగ్స్ కే పరిమితం చేస్తారు. ఒరిజినల్ క్రిటిక్స్ సినిమా బాలేదని చెప్పుకొచ్చినా కూడా సినిమా తమకు నచ్చితే మాత్రం ఆ మూవీని బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించేలా చేస్తారు. ఇలా దాదాపు మహేశ్ అన్ని సినిమాలకు ఇదే జరుగుతుంటుందని సినీ వర్గాల్లో టాక్.
తాజాగా మహేశ్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఓ మై బేబీ అంటూ సాగే మెలోడియస్ సాంగ్ ను బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ అనుకున్నారు. కానీ ఈ సాంగ్ మహేశ్ ఫ్యాన్స్ కు నచ్చినట్లు లేదు. సోషల్ మీడియాలో #OhMyBaby ట్యాగ్ క్రియేట్ చేసి నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సాంగ్ కు బాణీలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ట్యాగ్ చేసి ట్వీట్లు చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇది గుంటూరు కారం సినిమా రేంజ్ కాదు.. పాట బాలేదంటూ ట్వీట్లు పెడుతున్నారు. అయితే మహేశ్ సర్కార్ వారి పాట సినిమా విషయంలో ఇలానే చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలేదంటూ నెట్టింట రచ్చ చేశారు.
ఇప్పుడు.. ఓ మై బేబీ సాంగ్ లిరిక్స్ బాలేవు, మహేశ్- త్రివిక్రమ్ సినిమాలో ఉండాల్సిన స్థాయి పాట కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్లకు ఈ సాంగ్ వల్ల లాభం లేదని, సినిమా నుంచి పాటను తీసేయండంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పాటను షూట్ చేసి రీప్లేస్ చేయడంటూ సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ ఫ్యాన్స్ ట్వీట్స్ కు ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మహేశ్ సరసన శ్రీలీలతోపాటు నటి మీనాక్షి చౌదరీ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, ముకేష్ రిషీ, రఘుబాబు, ఆశీష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. హారిక అండ్ హసినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై యస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.