Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. అమ్ము.. రమణగాడు

కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన సాంగ్ ప్రోమో కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఓ మై బేబీ అనే ఈ పాట కు రామ జోగయ్య శాస్త్రి రచన సహకారం అందించక శిల్పా రావ్ పాటను పాడారు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 12:15 PM GMT
గుంటూరు కారం.. అమ్ము.. రమణగాడు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదలకు టైం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన సాంగ్స్ ద్వారానే ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.


ఇప్పటికే పోస్టర్స్ ద్వారా అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. మొదట కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం త్రివిక్రమ్ తన అప్డేట్స్ ద్వారా బజ్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇక మొదటి పాట ధమ్ మసాలా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక పాటను కూడా విడుదల చేయాలి అని డిసైడ్ అయ్యారు.

కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన సాంగ్ ప్రోమో కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఓ మై బేబీ అనే ఈ పాట కు రామ జోగయ్య శాస్త్రి రచన సహకారం అందించక శిల్పా రావ్ పాటను పాడారు. ఇక ఈసారి థమన్ రొమాంటిక్ ట్రాక్ తో తెప్పించబోతున్నట్లుగా అర్థమవుతుంది."అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది.." అని ఈ ప్రోమోలో శ్రీలీలతో చెబుతారు మహేశ్ బాబు.

చూస్తూ ఉంటే త్రివిక్రమ్ మార్క్ కు తగ్గ రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ లీల క్యారెక్టర్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఆమె తెలుగు అమ్మాయి తరహాలో అందరితో చాలా ఆకట్టుకుపోతున్నట్లు కూడా కనిపిస్తోంది. మహేష్ బాబు అయితే రమణ అనే క్యారెక్టర్ లో గుంటూరు నాటు అబ్బాయిగా ఒకవైపు మాస్ ను మరొకవైపు క్లాస్ ను హైలైట్ చేయబోతున్నట్లు కూడా అనిపిస్తుంది.

ఈ సినిమా పాటకు మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు. ఫుల్ పాటను డిసెంబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ చేశారు. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సారి త్రివిక్రమ్ మహేష్ బాబుతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.