67 ఏళ్ల వయసులో 10వ తరగతి చదువుతోన్న నటుడు!
ఇలా ఇంతటి చరిత్ర కలిగిన నటుడు ఇప్పుడు 10 వతరగతి చదువుతున్నాడు? అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిన నిజం.
By: Tupaki Desk | 24 Nov 2023 7:38 AM GMTఇండస్ట్రీలో నాలుగు దశాబ్ధాల ప్రాయణం. 400 చిత్రాల్లో నటించిన అనుభవం సొంతం. జాతీయ ఉత్తమ నటుడిగానూ అవార్డులు..రివార్డులు అందుకున్న చరిత్ర ఆయనది. నటుడిగా ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. లక్షల్లో పారితోషికం అందుకుంటున్నాడు. సినిమాలో అతడుంటే సినిమాకే ఓ ప్రత్యేకమైన క్రేజ్. ఇలా ఇంతటి చరిత్ర కలిగిన నటుడు ఇప్పుడు 10 వతరగతి చదువుతున్నాడు? అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిన నిజం.
ఇంతకీ ఎవరా నటుడు? 10వ తరగతి కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సస్ అయిన ఆ లెజెండ్ ఎవరంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. అతనే మాలీవుడ్ నటుడు ఇంద్రాన్స్. ఆర్దిక ఇబ్బందులు కారణంగా చిన్నప్పుడు నాల్గవ తరగతిలోనే చదువు మానేసారు. చదువులో తెలివైన వాడు అయినా పేదరికం ఆయన చదువుకు అడ్డొచ్చింది. దీంతో చదువు మధ్యలోనే మానేసి వివిధ పనులు చేసి జీవనం సాగించాడు.
అటుపై సినిమా రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. కోట్ల ఆస్తి సంపాదించాడు. కానీ తనలో చదువు కోవాలి అన్న ఆసక్తి మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. చదువుకు వయసుతో సంబంధం లేదని..పదవ తరగతి సర్టిఫికెట్ సంపాదించాలని ఆయన ఇప్పుడు క్లాసులకు వెళ్తున్నారు. వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పరీక్షలు రాసి తన కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ 67 ఏళ్ల నటుడు గత నాలుగు దశాబ్దాలుగా 400 చిత్రాల్లో నటించారు.
1981లో టైలరింగ్ షాపులో పని చేస్తూ.. ప్రొడక్షన్ హౌస్‌లకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేవారు. ఆ పరిచయలతోనే మెల్లగా మ్యాకప్ వేసుకోగలిగారు. 1994లో ఇంద్రాన్స్ నటుడిగా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోయింది. రాష్ట్ర - జాతీయ చలనచిత్ర అవార్డులను దక్కించుకున్నారు. కానీ ఇవేవి ఇంద్రాన్స్ కి తృప్తినివ్వలేదు. గొప్ప చదువులు చదవాలని ఉన్నా చదవలేకపోయిన నటుడు అదే చదువు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`నిరక్షరాస్యుడిగా ఉండటం అనేది అంధుడి` తో సమానంగా పోల్చారు. అందువల్లే తాను ఇప్పుడు మళ్లీ పదవతరగతి క్లాసులకు వెళ్తున్నట్లు తెలిపారు. ఒకేసారి అన్ని పరీక్షలు పాసై పదవతరగతి పూర్తిచేస్తా నన్నారు. ఇంద్రన్స్ ఇప్పుడు తన ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం తరగతులకు హాజరవుతున్నారు.