Begin typing your search above and press return to search.

పనిమనిషితో పాపుల‌ర్ న‌టుడు లైంగిక సంబంధం

పాపుల‌ర్ న‌టుడు వ్యక్తిగత జీవితం వివాదంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 11:24 AM GMT
పనిమనిషితో పాపుల‌ర్ న‌టుడు లైంగిక సంబంధం
X

పాపుల‌ర్ న‌టుడు వ్యక్తిగత జీవితం వివాదంలోకి వచ్చింది. న‌టుడి ఆత్మ‌క‌థ స్క్రిప్టును మార్చేశారంటూ అత‌డి భార్య తీవ్రంగా క‌ల‌త చెందారు. పుస్తకంలోని కంటెంట్‌ను న‌టుడి మాజీ సహోద్యోగి భార్య తారుమారు చేసిందని ఆమె ఆరోపించారు.. వివ‌రాల్లోకి వెళితే...

బాలీవుడ్ నటుడు ఓంపూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడు 2017లో దివంగ‌తుడ‌య్యారు. ఆయ‌న లేక‌పోయినా కానీ అతడి న‌ట‌నా వైవిధ్యం.. డైలాగ్స్ అభిమానుల‌ హృదయాలలో సజీవంగా ఉంచాయి. సినీరంగంలో అత‌డి కెరీర్ గురించిన వివరాలతో ఆత్మకథ `అన్‌లైక్‌లీ హీరో: ఓం పురి`లో ర‌చ‌యిత‌లు రాసారు. అయితే ఈ పుస్తకం వివాదాస్ప‌ద‌మైంది. ఎందుకంటే ఇందులో చాలా దిగ్భ్రాంతికరమైన విష‌యాల‌ను చ‌ర్చించారు.

ఈ పుస్తకంలో దివంగత నటుడు ఓంపురి తన పనిమనిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని చెప్పుకున్న ఒక ఘ‌ట‌న‌ను ప్ర‌స్థావించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఓం పూరి సమ్మతి లేకుండానే ఈ కంటెంట్ బయటకు వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల దివంగత స్టార్ ఓంపురి భార్య నందితా పూరి వివాదాస్పద కంటెంట్ , దాని ప్రభావం గురించి మాట్లాడారు. సిద్ధార్థ్ కన్నన్‌తో మాట్లాడుతూ ఓంపూరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను మార్చారు.

అవి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తీవ్ర ఆందోళ‌న చెందింది. నందిత ప్రకారం.. ఓం పూరి తనపై ఒక పుస్తకం రాయాలని కోరుకున్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. అత‌డు ఆడియో రికార్డ్‌లో తన జీవితంలోని కథలను ఆమెకు ఇచ్చాడు. అయితే ఓంపూరీ ఆత్మకథ రాయాలనుకున్న మరో వ్యక్తి కూడా వీరి మ‌ధ్య‌ ఉన్నారు. ఆమె ఓమ్ సహోద్యోగికి మాజీ భార్య.. ఆమె వ‌ల్ల‌నే విషయం వికారమైన మలుపు తిరిగింది. పూరీ వ్యక్తిగత జీవితం గురించి అసహ్యకరమైన కథనాలు రాసారు.

దీని గురించి నందిత మాట్లాడుతూ-``అత‌డిపై ఈ వాదనలు తప్పు. నాకు వికీపీడియా మీద నమ్మకం లేదు. ఆయన్ని కలిసినప్పుడు పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చింది. ఆయ‌న ఏమ‌న్నారంటే.. నా గురించి రాయాలి. నా బాల్యం చార్లీ చాప్లిన్ లాంటిది.. అని అన్నారు. నా కఠినమైన బాల్యం నా గురించి మాత్రమే కాకుండా, మొత్తం సినిమా ఉద్యమం.. నాతో క‌లిసి పనిచేసిన వ్యక్తుల గురించి రాయడానికి నన్ను ప్రేరేపించింది. ఈ పుస్తకం రాయడానికి నాకు 16-17 సంవత్సరాలు పట్టింది.. అని తెలిపారు.

అయితే ఓంపురి గురించి వివాదాస్ప‌ద అంశం బ‌య‌ట‌ప‌డ‌టానికి కార‌ణం .. అత‌డు త‌న ఆత్మ‌క‌థ‌ను రాసే అవ‌కాశం ఒకేసారి ఇద్ద‌రికి క‌ల్పించారు. ఒక‌రు త‌న భార్య అయితే, మ‌రొక‌రు స‌హోద్యోగి భార్య‌. ఇదే విష‌యాన్ని ఓంపురి భార్య నందిని తెలిపారు. ఆమె మాట్లాడుతూ-``పుస్తకం రాయాలనుకునే మరొకరు ఉన్నారని నాకు అప్పుడు తెలిసింది. కాబట్టి నేను చాలా కలత చెందాను. ఆమె తన మాజీ భర్త ఓం సహోద్యోగి కావడంతో దాని గురించి ఓమ్‌కి చెప్పింది. ఓం త‌న భార్య నందితకి నో చెప్పలేక వారిద్దరినీ పుస్తకం రాయమని అడిగారు. ఎవరి దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే అది తదుపరి దశకు వెళ్తుందని చెప్పారు. కానీ ఆమె కజిన్ ఎల్లో జర్నలిస్ట్.. గాసిప్ ఫిల్మ్ రైటర్.

ఓంపురిని మొత్తం భారతీయ ప్రచురణ సంస్థ‌లు నిషేధించాయి. నాకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. కాబ‌ట్టి త‌ప్పులు జ‌రిగాయి. నా పబ్లిషర్ రోలీ బుక్స్ -తెహల్కా కార్యాలయం ఒకే భవనంపై ఉన్నాయి. కాబట్టి వారు స్నిప్పెట్‌లను షేర్ చేస్తుంటారు. కాబట్టి వారు అక్కడి నుండి స్నిప్పెట్‌లను పొందారు. ఇది చెడ్డ పుస్తకం.. స్క్రిప్ట్ ఓం పురికి చూపించలేదని నందిత‌ పేర్కొన్నారు. ఓం పూరి వివాదాస్ప‌ద లీకుల‌ గురించి పెద్దగా పట్టించుకోలేదని గుర్తుచేసుకుంది. అయితే విషయాలు బయటకు పొక్కడంతో నందిత మనస్తాపానికి గురైంది.