Begin typing your search above and press return to search.

ఓం రౌత్.. ఈసారి ప్రభాస్ ఫ్లాప్ గురించి ఏమన్నారంటే..

అయితే ఓం రౌత్ ప్రభాస్ ఇమేజ్ గురించి ఒక ఫ్లాప్ మూవీ తీసి చెబితే గాని ఎవరికి తెలియదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 4:15 AM GMT
ఓం రౌత్.. ఈసారి ప్రభాస్ ఫ్లాప్ గురించి ఏమన్నారంటే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ఓ విధంగా ఇండియన్ ఇండస్ట్రీలో ఎవ్వరు అందుకోలేని హైట్స్ ని ప్రభాస్ ఇప్పటికే రీచ్ అయ్యాడు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ హీరోగా ప్రభాస్ ఇమేజ్ స్టాండర్డ్ గా ఉండిపోతుంది. దేశంలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. కల్కి 2898ఏడీ మూవీ ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ ప్రభాస్ లైన్ అప్ లో ఐదు సినిమాల వరకు ఉన్నాయి.

అన్ని కూడా పాన్ ఇండియా బ్రాండ్ తో అత్యధిక బిజినెస్ వేల్యూ ఉన్న సినిమాలే కావడం విశేషం. ప్రభాస్ తో బాహుబలి తర్వాత ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఒక్క రాధేశ్యామ్ మాత్రమే అతి తక్కువ కలెక్షన్స్ ని సాధించింది. రాధేశ్యామ్ కంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ఆదిపురుష్ మూవీ కూడా 450 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. సలార్ మూవీకి ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయిన 700 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది.

ఓ విధంగా ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ భారీ వసూళ్లని బాక్సాఫీస్ దగ్గర సాధించింది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాని తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఓ ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సల్మాన్ ఖాన్, ప్రభాస్ లు ఫ్లాప్ ప్రూఫ్ స్టార్స్ అంటూ ప్రశంసించారు. అంటే వారికి ఫ్లాప్ లు పడిన కూడా ఇమేజ్ పరంగా ఏ మాత్రం చెక్కుచెదరనని స్టార్స్ అనే అభిప్రాయంతో ఓం రౌత్ ఈ కామెంట్స్ చేశారు.

అలాగే ప్రభాస్ కటౌట్ కనిపిస్తే సినిమాకి 500+ కోట్ల బిజినెస్ ఈజీగా అయిపోతుందని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. అయితే ఓం రౌత్ ప్రభాస్ ఇమేజ్ గురించి ఒక ఫ్లాప్ మూవీ తీసి చెబితే గాని ఎవరికి తెలియదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ డిజాస్టర్ అయిన కూడా 450 కోట్ల కలెక్షన్స్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఈ వసూళ్లు చూపించి ప్రభాస్ ని ఫ్లాప్ ప్రూఫ్ హీరో అని ఓం రౌత్ చెబుతున్నాడా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఇమేజ్ కి ఏ విధంగా కూడా నష్టం కలిగించకపోయిన దర్శకుడు ఓం రౌత్ ని మాత్రం డీగ్రేడ్ చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ ఎదుర్కొనేలా చేసిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.