ఓం భీమ్ బుష్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలి?
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఓం భీమ్ బుష్
By: Tupaki Desk | 23 March 2024 5:23 AM GMTశ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ఓం భీమ్ బుష్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని వి సెల్యులాయిడ్స్ బ్యానర్ రిలీజ్ చేసింది. శ్రీ విష్ణు చివరిగా సామజవరగమన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్ అంటే జాతిరత్నాలు గుర్తుకురావడం గ్యారెంటీ.
ఆ తరహాలోనే ఈ చిత్రమని హీలేరియస్ కామెడీతో దర్శకుడు శ్రీ హర్ష సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు. లాజిక్స్ ఆలోచించకుండా రెండు గంటలు వినోదం అందించడమే లక్ష్యంగా కథ, కథనం సిద్ధం చేసి ప్రేక్షకులకి అందించాడు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. కామెడీ కథకి కాస్తా హర్రర్ టచ్, అలాగే నిధి అంటూ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు.
ఈ రకమైన కామెడీ కథలకి ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. యూత్ ఆడియన్స్ కూడా ఇలాంటి సరదా సినిమాలు ఎక్కువ కోరుకుంటున్నారు. శ్రీవిష్ణు సామజవరగమన హిట్ పడటంతో ఓం భీమ్ బుష్ కి థీయాట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. వరల్డ్ వైడ్ గా 6.56 కోట్ల బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 6.8 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసారి విష్ణు తన రేంజ్ పెంచుకున్నాడు అని చెప్పవచ్చు. అతని సక్సెస్ రేటు వల్ల అలాగే సెలెక్ట్ చేసుకుంటున్న కథల వలన మార్కెట్ వాల్యూ పెరుగుతోంది. ఈ సినిమాకు కూడా మంచి రేట్లు దక్కాయి. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు ఈ చిత్రానికి పోటీగా చెప్పుకోదగ్గ మూవీస్ అయితే ఏవీ లేవు.
దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ సాలీడ్ గానే వచ్చినట్లు సమాచారం. ఇక వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసే సినిమాగా ఉండటంతో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వీకెండ్ లోనే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకొని హిట్ బొమ్మగా మారే అవకాశం ఉంది. ఇక సినిమాకు మౌత్ టాక్ ద్వారా మరింత హైప్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ దొరికితే ఏ సినిమా కైనా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఓం భీమ్ బుష్ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.