Begin typing your search above and press return to search.

ఓం భీమ్ బుష్.. ఆ ఒక్క సీన్ చాలట!

టాలీవుడ్ యువ నటుడు శ్రీ విష్ణు, స్టార్ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్

By:  Tupaki Desk   |   20 March 2024 2:35 PM GMT
ఓం భీమ్ బుష్.. ఆ ఒక్క సీన్ చాలట!
X

టాలీవుడ్ యువ నటుడు శ్రీ విష్ణు, స్టార్ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్. గతంలో ఈ ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఓం భీమ్ బుష్ మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మార్చి 22వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ వెరైటీగా చేస్తున్నారు మేకర్స్. దీంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయింది.

ఇటీవల ఓం భీమ్ బుష్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అధికారులు.. యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. అయితే ఈ మూవీ క్రిస్పీ రన్ టైం 2 గంటల 15 నిమిషాలు (135 నిమిషాలు)తో థియేటర్ లో విడుదల కానుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. హుషారు ఫామ్ దర్శకుడు హర్ష కొనగంటి తెరకెక్కించిన ఈ చిత్రం కొత్త స్టోరీ పాయింట్‍ తో ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో జాతి రత్నాలు వైబ్స్ కనిపిస్తున్నాయని సినీ పండితులు చెబుతున్నారు. ఈ మూవీలో ఐదు ఫుల్ ఎంటర్టైనింగ్ సూపర్ సీన్స్ ఉన్నాయట. అవి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో నవ్విస్తాయట. సెకండాఫ్ లో దెయ్యం సీన్ ఉందట. అది సినిమాకు హైలైట్ గా నిలవనుందట. ఈ సీన్ కచ్చితంగా అలరిస్తోందట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్.. సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం.. విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కు యూట్యూబ్‍లో మూడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అయితే ట్రైలర్‌ లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ డైలాగులతోపాటు కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. సైంటిస్టులుగా ఓ ఊరికి వెళ్లి ఎలాంటి సమస్య అయినా తీర్చుతామని అందరికీ చెప్పడం ఎంటర్టైనింగ్ గా అనిపిస్తోంది. సంపంగి మహల్‍ లో నిధి కోసం ముగ్గురు వెళ్లడం సినిమా మెయిన్ కాన్సెప్ట్ గా తెలుస్తోంది.

ఇక ఓం భీమ్ బుష్ చిత్రంలో ప్రీతి ముకుందన్, బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ బలుసుతో కలిసి వీ సెల్యులాయిడ్‍ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. సన్నీ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరించారు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా.. ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.