Begin typing your search above and press return to search.

దేవర.. మరో సర్ ప్రైజ్ ఉంది, కానీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర.

By:  Tupaki Desk   |   16 May 2024 4:34 AM GMT
దేవర.. మరో సర్ ప్రైజ్ ఉంది, కానీ..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం కొరటాల చేస్తున్నారు. ఈ మూవీ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది.

దేవర మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఉండబోతోందని ఇప్పటికే కొరటాల శివ కన్ఫర్మ్ చేసేశారు. ఓ ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కించారు. దేవర నుంచి ఇదివరకు వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. కచ్చితంగా తారక్ ఇమేజ్ ని మరింత పైకి తీసుకెళ్ళే మూవీ దేవర అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని మే 20న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడం ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ గా టైటిల్ సాంగ్ ని సిద్ధం చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా ఈ విషయాన్ని ధృవీకరించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం సాంగ్ ఫైనల్ వర్క్ చేస్తున్నారంట.

లెరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ చేస్తుందని తెలుస్తోంది. దాంతో పాటుగా మరొకటి కూడా సిద్ధం చేస్తున్నారంట. ఒక వేళ సాంగ్ అనుకున్న టైంకి రెడీ కాకపోతే వీడియో సాంగ్ ప్రోమో అయిన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. చిత్ర యూనిట్ చెప్పినదాని ప్రకారం అయితే మేగ్జిమమ్ టైటిల్ సాంగ్ రావడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఆల్టర్ నేటివ్ ఛాయస్ గా మాత్రమే సాంగ్ ప్రోమో ఉంటుందంట.

ఈ సినిమాపై తారక్ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ ఏడాది గ్యాప్ తీసుకొని దేవర మూవీ చేస్తున్నారు. గతంలో జక్కన్నతో మూవీ చేసిన తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ని దేవర చిత్రంతో బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడు. కొరటాల శివకి కూడా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో కచ్చితంగా సాలిడ్ హిట్ కొట్టాల్సిందే.