ఒంగోలు గిత్త ఎంగేజ్ మెంట్ కానిచ్చేసిందే!
అయితే ఇంతవరకూ ఏనాడు ఆ ఇద్దరు అధికారికంగా ప్రకటించింది లేదు.
By: Tupaki Desk | 30 Jan 2024 9:14 AM GMTకృతికర్బందా- పులకిత్ సామ్రాట్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు ప్రచారం సాగుతోన్న సంగతి తెలి సిందే. నాలుగేళ్లగా ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తుందని మీడియాలో కథనాలు రావడం..వాటికి తగ్గట్టు ఆ జోడీ కెమెరా కంట పడటంతో ఇద్దరి మధ్య సీరియస్ గానే లవ్ లో ఉన్నారని అర్దమైంది. అయితే ఇంతవరకూ ఏనాడు ఆ ఇద్దరు అధికారికంగా ప్రకటించింది లేదు. దీంతో ఆ రిలేషన్ షిప్ కొంత కాలం తర్వాత బ్రేక్ అయ్యే అవకాశం ఉందని..అందుకే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదని బాలీవుడ్ మీడియాలో విమ ర్శలు తెరపైకి వచ్చాయి.
అయితే వాటన్నింటికి తెర దించుతూ ఈ జోడీ ఏకంగా సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ తో ప్రేక్షకాభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. ఈ వేడుక నిరాండంబరంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యు లు.. స్నేహితులు ..అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్దం జరిగింది. ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట రిలీజ్ అవ్వడంతోనే ఈ విషయమంతా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు జంటగా దిగిన ఫోటో లు....కుటుంబాలు కలిసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ జోడీకి అభిమానులంతా విషెస్ తెలియజేస్తున్నారు. అయితే పెళ్లి తేది కూడా నిశ్చయించినట్లు లేదు. ఆవివరాలేవి రివీల్ చేయలేదు. మొత్తానికి కృతి కర్బందా పప్పన్నం పెట్టేయడానికి రెడీగా ఉందని తేలిపోయింది. అమ్మడు టాలీవుడ్ ప్రేక్షుకులకు సుపరిచితమే. సుమంత్ హీరోగా నటించిన `బోణీ` చిత్రంతో పరిచయమైంది. అటుపై `తీన్మార్`..'ఒంగోలు గిత్త` లాంటి చిత్రాల్లో నటించింది.
అలాగే రామ్ చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్లీ` చిత్రంలో చరణ్ కి అక్క పాత్ర పోషించింది. కానీ అమ్మడు ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. కొన్ని సినిమాలకే తిరిగి ముంబై వెళ్లిపోయింది. కెరీర్ అక్కడే నిర్ధిశిం చుకుని సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పులకిత్ తో పరిచయం..స్నేహ..ప్రేమ..పెళ్లి అన్ని షురూ చేసింది.