ఈ సినిమాలో ఫ్యామిలీ కథ 30 శాతమే..: దిల్ రాజు
ఇక సినిమా ప్రమోషన్స్ వల్ల కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
By: Tupaki Desk | 1 April 2024 9:26 AM GMTవిజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా పరుశురామ్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమా ఇప్పటికే సాంగ్స్ టీజర్ ట్రైలర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక సినిమా ప్రమోషన్స్ వల్ల కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది.
ఈసారి దిల్ రాజు కూడా తరదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపిస్తున్నారు. కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ ట్రెడిషనల్ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ముఖ్యంగా దిల్ రాజు కూడా పంచేకట్టుతో అందరినీ ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. ఇక ఆయన స్పీచ్ కూడా చాలా సరదాగా కొనసాగింది. దిల్ రాజు మాట్లాడుతూ దర్శకుడు పరశురామ్ ఈ ఐడియా నాకు చెప్పినప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి కుటుంబంలో కూడా ఒక స్టార్ అనేవారు ఉంటారు. అమ్మ నాన్న బాబాయ్ ఎవరైనా అయి ఉండవచ్చు. ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ కు ఒక దారి చూపిస్తారు.. ఫ్యామిలీ లో కష్టాలను ఎదుర్కోవడం అనేది మనందరి జీవితంలో జరిగేదే.
మన ఇండియాలో ఉన్న బలమైన సాంప్రదాయం ఫ్యామిలీ ఎమోషన్స్. మిగతా దేశాల్లో మాత్రం అలా ఉండవు. కానీ మన కల్చర్ లో మాత్రం ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే అలాంటి కథ డైరెక్టర్ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఆ కథను డెవలప్ చేస్తూ హీరో క్యారెక్టర్ ని కూడా డిజైన్ చేసుకున్న విధానం బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. విజయ్ ఈ సినిమాలో నవ్విస్తాడు ఏడిపిస్తాడు దెబ్బలు తింటాడు కొడతాడు అన్ని రకాల వెరీయేషన్స్ తో ఆకట్టుకున్నాడు. 360 డిగ్రీస్ లాంటి క్యారెక్టర్ అని చెప్పవచ్చు.
ఇక హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. విజయ్ తో ఆమె కెమిస్ట్రీ చాలా హైలెట్ అయింది. ఈ సినిమాలో ఫ్యామిలీ పాయింట్ మీద లవ్ స్టోరీ కూడా చాలా ప్రధానంగా కనిపిస్తుంది. సినిమాలో 70% లవ్ స్టోరీ ఉండగా మిగతా 30% ఫ్యామిలీ కథగా ఉంటుంది. ఇక ఆమెకు ఈ సినిమాతో ఇండస్ట్రీలో మరో మంచి సక్సెస్ దక్కుతుంది అని అనుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఇప్పటికే మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా ప్రతి ఒక్కరు కూడా సినిమాలో వారి పనితనాన్ని చూపించారు. టెక్నీషియన్స్ అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగే సినిమాను కంప్లీట్ చేశారు. ఏప్రిల్ 5 అనేది నా స్పెషల్ డే. ఎందుకంటే నా మొదటి సినిమా దిల్ 2003 లో అదే రోజు వచ్చింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత అదే రోజు ఈ సినిమా రావడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. అలాగే మీడియా మిత్రులతో ప్రత్యేకంగా ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం ఒక వేడుక జరుపుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యులను కూడా వేడుకకు తీసుకురావాలని కోరుకుంటున్నాము అని దిల్ రాజు తెలియజేశారు.