Begin typing your search above and press return to search.

ఓ పిల్లో.. మెకానిక్ రాకీ మెలోడీ ట్రాక్

విశ్వక్ సేన్ తన పాత్రకు మరింత న్యాయం చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 7:40 AM GMT
ఓ పిల్లో.. మెకానిక్ రాకీ మెలోడీ ట్రాక్
X

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్, నెక్స్ట్ 'మెకానిక్ రాకీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అక్టోబర్ లోనే సినిమా విడుదల కాబోతోందని మొదటగా అనుకున్నప్పటికీ, పలు కీలక సన్నివేశాల మరింత ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల విడుదల తేదీపై మార్పు ఉండొచ్చని తెలుస్తోంది.

విశ్వక్ సేన్ తన పాత్రకు మరింత న్యాయం చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన మెకానిక్ షెడ్ సెట్‌లో షూట్ జరుగుతోందని సమాచారం. సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్‌లో ఉండటంతో, ప్రేక్షకులకు కొత్తదనం అందించడమే లక్ష్యంగా విశ్వక్ సేన్ కృషి చేస్తున్నారు.

విశ్వక్ సేన్ ఎన్నడూ రాజీ పడడు. నటన పరంగా తన కెరీర్‌లో ప్రతి సినిమాలో కొత్తదనం, మంచి అవుట్ ఫుట్ ఇవ్వడం కోసం ఎలాంటి కష్టమైనా పడతాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఈ చిత్రంలో ఆయన సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్లు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక లవ్ మెలోడీ ట్రాక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లిరికల్ సాంగ్ "ఓ పిల్లో" ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. "ఓ పిల్లో" పాటలో హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ పాటను ఆకట్టుకునేలా చేసింది. కృష్ణ చైతన్య లిరిక్స్ అంధించగా జెక్స్ బీజొయ్ మ్యూజిక్ అందించారు. ఇక అజీజ్ నకాశ్ పాటను పాడారు.

ఈ పాట రిలీజ్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సాంగ్‌లోని క్యూట్ లిరిక్స్, ఆకర్షణీయమైన విజువల్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. పాటకి చక్కటి ట్యూన్స్, స్టైలిష్ విజువల్స్ జోడించడంతో ఈ లిరికల్ సాంగ్ సెన్సేషన్‌గా మారింది. సాంగ్ విడుదల తర్వాత, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల జోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పాట విడుదలతో "మెకానిక్ రాకీ" సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. చూస్తుంటే విశ్వక్ కెరీర్ లో మరో మాస్ హిట్ పడేలా ఉన్నట్లు తెలుస్తోంది.