భైరవ కోన ఈజ్ సేఫ్- మూడు రోజుల వసూళ్లు ఇలా..
టైగర్ మూవీ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఊరు పేరు భైరవకోన
By: Tupaki Desk | 19 Feb 2024 12:10 PM GMTటైగర్ మూవీ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ.. ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షోతోనే డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ మ్యాజికల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. సందీప్ కిషన్ కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మెల్లమెల్లగా వసూళ్లు పెరుగుతున్నాయి. తొలి రోజు రూ.6.03 కోట్ల వసూలు చేయగా.. రెండో రోజు రూ.7.07 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు రూ.7.20 కోట్లు వసూలు చేసింది.
కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల మార్కు దాటేసింది ఊరు పేరు భైరవకోన మూవీ. ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. మరోవైపు, ఓవర్సీస్ లో ఈ సినిమా క్వార్టర్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. యూఎస్ లో అప్పుడే లాభాల పంట పండిస్తున్న సందీప్ కిషన్ మూవీ... ఇండియాలో అతి త్వరలో సేఫ్ జోన్‌కు చేరుకోనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో సందీప్ కిషన్ తోపాటు వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ లీడ్ రోల్స్ లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అనిల్ సుంకర సమర్పించగా.. రాజేష్ దండా ఈ మూవీని నిర్మించారు. ఇటీవల కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ లో గెస్ట్ రోల్ లో నటించారు సందీప్ కిషన్. మయావన్-2 తోపాటు మరికొన్ని చిత్రాల్లో యాక్ట్ చేశారు.
సినిమా స్టోరీ లైన్ ఇదే..
భైరవకోన అనే గ్రామంలో ఎవరు అడుగుపెట్టినా చనిపోతుంటారు. అయితే దొంగతనం చేసి తప్పించుకునేందుకు సందీప్ కిషన్ తోపాటు అతడి ఫ్రెండ్స్ అదే ఊరులోకి వెళ్తారు. అక్కడి వారికి ఏం జరిగింది? గ్రామం నుంచి బతికి బయటపడ్డారా? అసలు దొంగతనం ఎందుకు చేశారు? అనేది మిగతా మూవీ. మరి ఈ సినిమా మీరు చూశారా?