'ఊరు పేరు భైరవ కోన' ట్రైలర్.. గరుడ పురాణంతో ఫాంటసీ కథ!
టాలీవుడ్ లో విభిన్న తరహా సినిమాలు చేసే యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటాడు
By: Tupaki Desk | 18 Jan 2024 6:56 AM GMTటాలీవుడ్ లో విభిన్న తరహా సినిమాలు చేసే యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటాడు. రొటీన్ మూవీస్ కాకుండా ప్రతి సినిమాకి కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. ఇప్పటివరకు అన్ని జోనర్స్ ని టచ్ చేసిన ఈ హీరోకి ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అయితే రావడం లేదు. అయినా కూడా వెనకడుగు వేయకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. అలా త్వరలోనే ఓ సరికొత్త ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. జస్ట్ సాంగ్స్, టీజర్ తోనే ఈ సినిమా ఆడియన్స్ లో భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ను ఈరోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ట్రైలర్ చూస్తుంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా, విరూపాక్ష ఛాయలు కనిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే.. మొదలుపెట్టడమే లవ్ ఫీల్ రొమాంటిక్ యాంగిల్ తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా భైరవకోన అనే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. గరుడ పురాణం, కర్మ సిద్ధాంతం రెండింటిని కలిపి సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.' గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' అనే డైలాగ్ తో ఆసక్తిని పెంచారు.
'భగవంతుడు ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని' అనే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచేసింది.' చేతికి అంటున్న రక్తాన్ని కడిగినంత సులభం కాదు.. చేసిన పాపాన్ని కడగడం: అనే డైలాగ్ కథలోని ఇంటెన్సిటీని తెలియజేసేలా ఉంది. ఇక ట్రైలర్లో విజువల్స్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ట్రైలర్ చూస్తున్నంత సేపు కాంతారా, విరూపాక్ష ఫ్లేవర్స్ కనిపించాయి.
ఇక ట్రైలర్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ సైతం రౌడీలతో ఫైట్ చేయడం ట్రైలర్లో చూపించారు. ఆ షాట్ ని బట్టి ఆమె పాత్రలో కచ్చితంగా ట్విస్ట్ పెట్టి ఉంటారు అని అనిపిస్తుంది. ఆమెతోపాటు కావ్య మరో హీరోయిన్గా కనిపించింది. వెన్నెల కిషోర్ కూడా ఇందులో నెగిటివ్ షెడ్ క్యారెక్టర్ చేసినట్టు ట్రైలర్ లో చూపించారు. మొత్తంగా ట్రైలర్ చూస్తే ఈసారి సందీప్ కిషన్ భారీ సక్సెస్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు.