రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా పనవ్వలేదు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో 'ఆపరేషన్ వాలంటైన్' అనే మరో ప్రయోగాత్మక చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 Feb 2024 4:30 PM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో 'ఆపరేషన్ వాలంటైన్' అనే మరో ప్రయోగాత్మక చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. ఇంత వరకూ ఇలాంటి ప్రయోగం తెలుగు నుంచి ఏ హీరో ప్రయత్నిం చలేదు. పుల్వామా దాడుల్ని ఆధారంగా చేసుకుని శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ కూడా హిందీ కుర్రాడే. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కుర్రాడు..కావడం ఎయిర్ ఫోర్స్ నేపథ్యంపై మంచి పట్టు సంపాదించిన తర్వాత తెరకెక్కించిన చిత్రమిది.
మరి ఈ సినిమాలో పాత్రకి వరుణ్ ఎలా సన్నధం అయ్యాడు? గతంలో ఎలాంటి అనుభవం లేని నేపథ్యంలో అతడు ఎదుర్కున్న సవాళ్లు ఎలాంటివి? అంటే వరుణ్ ఆసక్తికర సంగతులు పంచుకు న్నాడు. ఈ సినిమాకి ముందు వరుణ్ కి హిందీ రాదుట. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పాలని రెండు నెలలు పాటు ట్రైనర్ నియమించుకుని హిందీ కూడా నేర్చుకున్నాడుట. తానే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పాడుట.
అయితే ఆ డబ్బింగ్ అంతగా సూట్ కాలేదని దర్శకుడు సంతృప్తి చెందలేదుట. దీంతో మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వరుణ్ పాత్రకి డబ్బింగ్ చెప్పించారుట. ప్రతీ సన్నివేశాన్ని రెండు భాషల్లో తెరకెక్కించే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డా అంటున్నాడు. అది చాలా కష్టమైన పనిగానూ అనిపించిందిట. ఒకే సన్నివేశాన్ని ముందు తెలుగులో తీయడం..తర్వాత హిందీలో తీయడం...ఒక్కోసారి తాను అనుకున్నట్లు సీన్ రాకపోవడం..ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా క్యారీ అవ్వకపోవడం వంటివి జరిగాయట.
సినిమా ప్రారంభానికి ముందు వరుణ్ చాలా మంది ఎయిర్ ఫోర్స్ అధికారుల్ని కలిసాడుట. నిజమైన ఎయిర్ బేస్ లోనే చిత్రీకరణ జరిపినట్లు తెలిపాడు. ఎయిర్ ఫోర్స్ లో కూడా తెలుగు వాళ్లు చాలా మంది ఉండటంతో చాలా విషయాలు తెలుసుకు న్నానని....వాళ్లు చేపట్టిన ఆపరేషన్ల గురించి చెబుతుంటే ఎంతో షాకింగ్ గా అనిపించిందని' అన్నాడు.