Begin typing your search above and press return to search.

81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఐదు అవార్డుల్లో ఓపెన్ హైమర్..!

వరల్డ్ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల అనౌన్స్ మెంట్ జరిగింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 7:26 AM GMT
81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఐదు అవార్డుల్లో ఓపెన్ హైమర్..!
X

వరల్డ్ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల అనౌన్స్ మెంట్ జరిగింది. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ అవార్డులు కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట పడింది. సిలియన్ మర్ఫీ లీడ్ రోల్ లో నటించిన ఓపెన్ హైమర్ సినిమాను క్రిస్టోఫర్ నోలెన్ డైరెక్ట్ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఓపెన్ హైమర్ కు 5 అవార్డులు వచ్చాయి. దీనితో పాటుగా బార్బీ సినిమాకు కూడా అవార్డులు వచ్చాయి.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ నిలిచింది. ఉత్తమ కామెడీ చిత్రంగా పూర్ థింగ్స్ సినిమా అవార్డు కైవసం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ స్క్రీన్ ప్లే కేటగిరిలో జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి నిలిచారు. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ సినిమాకు గాను అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా లిల్లీ గ్లాడ్ స్టోన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లార్ మూన్ సినిమాకు అందుకున్నారు.

ఉత్తమ హాస్య నటిగా ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ సినిమాకు అందుకున్నారు. బెస్ట్ కమెడియన్ మేల్ కేటగిరిలో పాల్ గియా మట్టి ది హోల్డోవర్స్ సినిమాకు అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్ లో ఓపెన్ హైమర్ సినిమాకు గాను రాబర్ట్ డౌనీ అందుకోగా.. సపోర్టింగ్ రోల్ ఫిమేల్ కేటగిరిలో ది హోల్డోవర్స్ సినిమాకు గాను డావిన్ జా రాండోల్ఫ్ అందుకున్నారు.

బెస్ట్ ఒరిజినల్ స్టోరీగా ఓపెన్ హైమర్ సినిమాకు గాను లుడ్విగ్ గోరానన్సన్, బెస్ట్ నాంగ్ ఇంగ్లీష్ మూవీగా అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా బార్బీలోని వాట్ వాస్ ఐ మేడ్ నిలవగా.. బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ది బాయ్ అండ్ ది హెరాన్ సినిమా నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ బాక్సాఫీస్ అచీవ్ మెంట్ అవార్డు ను బార్బీ సినిమా కోసం వార్నర్ బ్రదర్స్ అందుకున్నారు.