Begin typing your search above and press return to search.

మాస్ రాజా మానియా… ఓపెనింగ్స్ లో పీక్

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకడిగా ఉన్నాడు. అతనితో సినిమా అంటే చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు

By:  Tupaki Desk   |   11 Feb 2024 5:13 AM GMT
మాస్ రాజా మానియా… ఓపెనింగ్స్ లో పీక్
X

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకడిగా ఉన్నాడు. అతనితో సినిమా అంటే చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలాగే తెలుగులో ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో కూడా అతనే కావడం విశేషం. రవితేజతో సినిమా అంటే నిర్మాత 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ రెడీగా పెట్టుకోవాల్సిందే. మాస్ మహారాజ్ రవితేజ నుంచి ప్రేక్షకులు యాక్షన్ ఎంత కోరుకుంటారో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఆశిస్తారు.

అయితే ఈ మధ్యకాలంలో అయన నుంచి వస్తోన్న సినిమాలలో రవితేజ మార్క్ కామెడీ మిస్ అవుతుందనే మాట వినిపిస్తోంది. చివరిగా ధమాకాలో రవితేజ ఫుల్ కామెడీ చేశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే కామెడీ లేని సినిమాలు సక్సెస్ సాధించలేదు. రవితేజలోని కామెడీ యాక్షన్ ఎక్కువగా ఆడియన్స్ ఇష్టపడుతున్నారని క్రాక్, ధమాకా రిజల్ట్ చూస్తేనే అర్ధమవుతుంది.

అయితే రవితేజ సినిమాలకి ఓపెనింగ్స్ భారీ వస్తాయి. టైర్ 2 హీరోలలో ఫస్ట్ డే డీసెంట్ కలెక్ట్ చేయగలిగే హీరోగా రవితేజ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆయన నుంచి వచ్చిన సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ చూసుకుంటే రవితేజ స్టామినా ఏంటో అర్ధం అవుతుంది. హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ క్రాక్ సినిమాని వచ్చాయి. మొదటి రోజు 6.25 కోట్ల షేర్ వచ్చింది. తరువాత ధమాకా సినిమా 4.66 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉంది.

టైగర్ నాగేశ్వరరావు 4.33 కోట్ల షేర్ అందుకొని మూడో స్థానంలో నిలిచింది. నెక్స్ట్ 4.30 కోట్ల షేర్ తో ఖిలాడీ ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈగల్ 3.93 కోట్ల షేర్ మొదటి రోజు అందుకుంది. రావణాసుర మూవీ 4.29 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రామారావు ఆన్ డ్యూటీ 2.82 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగింది. డిస్కో రాజా మూవీ 2.54 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఈగల్ మూవీ మొదటి రోజు షేర్ పరంగా చూసుకుంటే ఆయన చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.

అయిన కాకాని పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. కంటిస్టెంట్ గా తక్కువ బజ్ తో వచ్చిన కూడా రవితేజ సినిమాలు మంచి ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుంటూ ఉండటం చూస్తుంటే ఆయన మార్కెట్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈగల్ - 3.93CR******

టైగర్ నాగేశ్వరరావు - 4.33CR

రావణాసుర - 4.29CR

ధమాకా - 4.66CR

రామారావు ఆన్ డ్యూటీ - 2.82Cr

ఖిలాడీ - 4.30cr

క్రాక్ - 6.25Cr

డిస్కో రాజా - 2.54Cr